Thursday, May 16, 2024

Breaking: మీ వ‌డ్లు కొనం.. స్ప‌ష్టంచేసిన కేంద్రం

తెలంగాణ‌లో వ‌డ్లు కొనుగోలు చేసేది లేద‌ని కేంద్రం పేర్కొంది. సీఎం కేసీఆర్ 48 గంట‌ల డెడ్‌లైన్‌కు కేంద్రం స్పందించింది. ఇక మీద‌ట‌ బాయిల్డ్ రైస్ కొనేది లేద‌ని ఇంత‌కుముందే చెప్పామ‌ని తెలిపింది. ఈ మేర‌కు వ‌డ్ల కొనుగోలు అంశంపై స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ‘‘దేశ అవ‌స‌రాల‌కు మించి వ‌రి, గోధుమ సాగు అవుతోంది. పంజాబ్‌లో వ‌రి వినియోగం అంత‌గా ఉండ‌దు. అందుకే 90శాతం వడ్లు అక్క‌డ కొంటున్నాం. తెలంగాణ‌లో ఆ ప‌రిస్థితులు ఉండ‌వు. అందుకే వ‌రి కొనుగోలు చేయ‌బోమ‌ని చెప్పాం.

గ‌తంలో 44.7ల‌క్ష‌ల మెట్రిక్‌ ట‌న్నులు కొనుగోలు చేసేది. ఇప్పుడు తాము 60 ల‌క్ష‌ల మెట్రిక్‌ ట‌న్నులు కొనుగోలు చేశాం. బాయిల్డ్ రైస్ ఈసారి కొనుగోలు చేయ‌బోమ‌ని తెలంగాణ‌కు ముందే చెప్పాం. తెలంగాణ ప్ర‌భుత్వం దానికి అంగీక‌రించింది.’’ అని కేంద్రం తెలిపింది. దీనికి పంటల మార్పిడి ఒక్క‌టే ప్ర‌ధాన మార్గ‌మ‌ని తెలియ‌జేసింది కేంద్ర ప్ర‌భుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement