Saturday, April 27, 2024

Breaking : టిఆర్ ఎస్ పార్టీకి షాక్- తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి రామ‌చంద్రుడు తెజావ‌త్ రాజీనామా

టీఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి రామ‌చంద్రుడు తెజావ‌త్. తాను రాజీనామా చేస్తున్న‌ట్లు లేఖ‌ను టీఆర్ఎస్ అధిష్ఠానానికి పంపడంతో పాటుగా మీడియాకూ విడుద‌ల చేశారు. టీఆర్ఎస్‌కు తాను ఎందుకు రాజీనామా చేస్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌లో ప్ర‌స్తావించారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రామ‌చంద్రుడు త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అంత‌గా స్ప‌ష్ట‌త లేకున్నా… బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మాత్రం రామ‌చంద్రుడు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వైనాన్ని కీర్తించారు. ఇప్ప‌టికైనా టీఆర్ఎస్‌, కేసీఆర్ నిజ‌స్వ‌రూపాన్ని తెలుసుకుని సంకెళ్లు తెంచుకుని రామ‌చంద్రుడు బ‌య‌ట‌ప‌డ్డార‌న్నారు. ఆత్మ గౌర‌వానికి మించిన ఆభ‌ర‌ణం లేద‌ని సూచించిన ప్ర‌వీణ్‌ టీఆర్ఎస్ వ‌ద్ద ద‌గా ప‌డ్డ నాయ‌కులంతా ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని, దొర‌ల పోక‌డ‌ల‌పై పోరాడాల‌ని పిలుపునిచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార పార్టీ గ‌ట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement