Sunday, May 5, 2024

Breaking : త‌మిళ‌నాడు..ఏపీల‌కు మ‌రో గండం..జ‌వాద్ తుఫాన్..తో ముప్పు

ఇప్ప‌టికే వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతోన్న త‌మిళ‌నాడుకు మ‌రోగండం రానుంది. త‌మిళ నాడు స‌హా ఏపీకి ప్ర‌మాదం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో నేడు అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. 15 నాటికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది. ఆ తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖాధికారులు. ఆ తుపానుకు జవాద్‌ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దక్షిణ కోస్తా, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement