Friday, May 3, 2024

Breaking: అట‌వీ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు.. ఫారెస్ట్ రైట్స్ క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌న్న కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా: అభివృద్ధి పథంలో సిరిసిల్ల ముందుకు పోతుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఈరోజు ప‌లు శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాలో 4 లక్షల 72 వేల 329 ఎకరాలు భూమి ఉందని.. ఫారెస్ట్ 96.394 ఎకరాల అటవీ ప్రాంతం ఉందన్నారు కేటీఆర్‌. ప‌లు అంశాల‌పై ఆయ‌న స‌మీక్షించారు.

‘‘2005-06 కేంద్రం ఆర్ ఓ.ఎఫ్ ఆర్ చట్టాన్ని తీసుకు వచ్చింది. 67 గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించి సమస్య పరిష్కరించాలని చూస్తున్నాం. నవంబర్ 8 నుంచి గ్రామాల వారిగా సదస్సులు నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దరఖాస్తు పెట్టుకున్న పోడు రైతుల అర్జీలని పరిశీలిస్తాం. భ‌విష్యత్ లో ఎటువంటి సమస్య రాకుండా… దరఖాస్తు తీసుకొని సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అటవీ భూములను ఆక్రమించుకుండా చర్యలు తీసుకుంటాం’’ అన్నారు మంత్రి కేటీఆర్‌.

‘‘భవిష్యత్ లో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు కేటీఆర్‌. జిల్లా స్థాయి లో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేయాల‌ని, అడవులు అక్రమించకుండా చర్యలు తీసుకోవాల‌న్నారు. అటవీని సంరక్షణ చేయాల్సిన బాధ్యత అందరి పై ఉంది. రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వానికి రెండో ఎజెండా ఏమీ లేదని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement