Saturday, May 4, 2024

పైలెట్ లేకుండా పైకి ఎగిరిన హెలికాఫ్ట‌ర్ – చ‌రిత్ర‌లోనే ఫ‌స్ట్ టైం

పైలెట్ లేకుండానే పైకి ఎగిరింది హెలికాఫ్ట‌ర్. ఇది చ‌రిత్ర‌లోనే తొలిసారి. అమెరికాలోని కెంట‌కీలో ఆర్మీ అధికారులు పైలెట్ లేకుండా వెళ్ల‌గ‌లిగే అటాన‌మ‌స్ బ్లాక్ హాక్’ హెలికాప్టర్ ను టెస్ట్ చేశారు. ఫిబ్రవరి 5న దాదాపు అరగంటపాటు పైలెట్ లేకుండానే ఎగిరింది. సిమ్యులేషన్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఊహాజనిత సిటీలోని బిల్డింగులను దాటేస్తూ ముందుకెళ్లింది. ల్యాండింగ్ కూడా పర్ ఫెక్ట్ గా అయింది. గంటకు 190 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో 4 వేల అడుగుల ఎత్తులో ఎగిరింది. అదే హెలికాప్టర్ తో గత సోమవారం కూడా టెస్ట్ ఫ్లైట్ చేశారు. ‘అలియాస్’ అనే అమెరికా రక్షణ పరిశోధన కార్యక్రమం కింద ఈ కంప్యూటర్ ఆపరేటెడ్ హెలికాప్టర్ ను రూపొందించారు. ఇప్పుడీ వీడియో తెగ వైర‌ల్ అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement