Friday, April 26, 2024

చైనాతో పోలిస్తే మనం వెనకే ఉన్నాం: బిపిన్ రావత్

గత కొన్నేళ్లుగా సాంకేతికత విషయంలో ఇండియా కన్నా చైనా ఎన్నో అడుగులు ముందుకు వేసిందని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాపై సైబర్ దాడులకు దిగే శక్తి చైనాకు ఉందని మనకు తెలుసు. అదే జరిగితే, మన వ్యవస్థ చాలా నష్టపోతుందన్నారు. ఇండియాపై రెండు దేశాల మధ్య సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ విషయంలో చాలా తేడా ఉందని బిపిన్ రావత్ అన్నారు. ఇండియా, చైనాల మధ్య సైబర్ డొమైన్ విభాగంలో అతిపెద్ద తేడాలు ఉన్నాయని, సాంకేతికంగా అభివృద్ధి చెందిన చైనా, మనపై సైబర్ దాడులకు ప్రోత్సహించవచ్చని అన్నారు. ఇప్పటికే చైనా సైబర్ టెక్నాలజీ విభాగంలో భారీ ఎత్తున నిధులను వెచ్చిస్తోందన్నారు.సైబర్ దాడులను తట్టుకునే ఫైర్ వాల్స్ ను పెంచుకోవాలి. ఈ విషయంలో నాయకులు సీరియస్ గా ఆలోచించి, ప్రణాళికలను రూపొందించి, ముందడుగు వేయాలన్నారు బిపిన్ రావత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement