Sunday, May 5, 2024

మ‌రోసారి స‌మాజ‌సేవ కోసం – 20బిలియ‌న్ డాల‌ర్ల‌ను విరాళ‌మిచ్చిన బిల్ గేట్స్

స‌మాజ‌సేవ‌కోసం మ‌రోసారి విరాళ‌మిచ్చారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ . ఈ మేర‌కు 20 బిలియన్ డాలర్లను సమాజం కోసం విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. తన మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ తో కలసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’కు ఈ మొత్తాన్ని బిల్ గేట్స్ విరాళంగా ఇచ్చారు. ఈ వివరాలను తన వ్యక్తిగత బ్లాగ్ లో గేట్స్ ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఇది కూడా ఒకటి. బిల్ గేట్స్ తాజా విరాళంతో 2026 నాటికి ఈ స్వచ్ఛంద సంస్థ వార్షికంగా చేసే ఖర్చు 9 బిలియన్ డాలర్లుగా (రూ.70వేల కోట్లు) ఉండనుంది.

ఫౌండేషన్ నిర్వహణలోని నిధులు 70 బిలియన్ డాలర్లకు చేరతాయి. వారెన్ బఫెట్ సైతం గతంలో 3.1 బిలియన్ డాలర్లను ఈ ఫౌండేషన్ కోసం ఇచ్చారు. మన కాలంలో వచ్చిన ఈ అతి పెద్ద సంక్షోభ సమయంలో మనమంతా మరింత చేయూతనందించాలి’’ అని గేట్స్ పేర్కొన్నారు. కరోనా, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయినందున (కరెన్సీ విలువ క్షీణత) బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్న ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు మరింత వెచ్చించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement