Saturday, May 4, 2024

మోదీజీ, మహిళా పక్షపాతి అని మాటల్లో చెప్పడం కాదు.. దోషులకు శిక్షపడే చర్యలు తీసుకోండి: కేటీఆర్​

2002 గుజరాత్ హింసాకాండలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఇతర ముస్లింలను హత్య చేసిన కేసులో దోషులుగా ఉన్న 11 మందిని విడుదల చేయడంపై టీఆర్​ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఐటీ మంత్రి కె.టి. రామారావు (కెటిఆర్) ఇవ్వాల (బుధవారం) స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ప్రధాని (పిఎం) నరేంద్ర మోడీని విమర్శించారు. 11 మంది దోషులపై గుజరాత్ ప్రభుత్వం విధించిన రిమిషన్ ఆర్డర్‌ను రద్దు చేయాలని మోదీని కేటీఆర్ అభ్యర్థించారు. “ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ, మీరు నిజంగా మహిళలను గౌరవించడం గురించి మాట్లాడి ఉంటే, ఆ 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రిమిషన్ ఆర్డర్‌ను రద్దు చేయాలని కోరండి” అని కేటీఆర్​ తన ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇటీవల ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా 11 మంది రేపిస్టుల విడుదలపై ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళల గౌరవాన్ని తగ్గించే పనులు చేయబోమని భారతీయులు ప్రతిజ్ఞ చేయాలని మోదీ కోరారని ఒవైసీ తెలిపారు. అయితే.. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై ఓవైసీ ట్వీట్ చేస్తూ, “అతను ‘నారీ శక్తి’కి మద్దతు ఇవ్వడం గురించి చెప్పాడు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేరస్థులను గుజరాత్ బీజేపీ ప్రభుత్వం అదే రోజు విడుదల చేసింది. సందేశం స్పష్టంగా ఉంది’’ అని బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై ఒవైసీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement