Friday, April 26, 2024

బిగ్ బాస్ నుంచి లోబో ఔట్.. కానీ..

తెలుగు అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. ఆరో వారంలో లోబో ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన హోస్ట్ నాగార్జన్ అదిరిపోయే ట్వీస్ట్ ఇచ్చాడు. శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి స‌భ్యుల‌ను ఒక్కొక్క‌రిగా క‌న్ఫెష‌న్ రూంకి పిలిచిన నాగార్జున‌.. హౌజ్‌లో ఉండే అర్హ‌త ఎవ‌రికి లేదో చెప్పాల‌ని కోరాడు. ముందుగా వ‌చ్చిన మానస్.. శ్రీరామ్ పేరు చెప్పాడు. అనంతరం స‌న్నీ.. ప్రియ, కాజ‌ల్‌.. ప్రియ‌; అనీ మాస్ట‌ర్, శ్వేత‌, సిరి, ష‌ణ్ముఖ్‌..లోబో పేరు చెప్పారు. ఈ ప్రక్రియలో లోబోను నాలుగురు, ప్రియను నాలుగురు ఇంటి సభ్యులు అనర్హులుగా చెప్పారు. అయితే ఈ ఇద్ద‌రిలో ఇద్ద‌రిలో ఎక్కువ మంది ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తే వారు సేఫ్ అవుతారు, మిగ‌తా వారు ఎలిమినేట్ అవుతారు అని నాగార్జున ప్రకటించారు. దీంతో ర‌వి, స‌న్నీ, విశ్వ.. ముగ్గురు లోబోకు మద్దతుగా నిల‌బ‌డ‌గా మిగిలిన ఇంటి సభ్యులు అంద‌రూ ప్రియ‌కు మ‌ద్ద‌తిచ్చారు. దీంతో లోబో ఎలిమినేట్ అయిన‌ట్లు నాగ్‌ ప్ర‌క‌టించాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు అత్యధికంగా ఓటు వేసిన నేపథ్యంలో లోబో ఎవిక్ట్ అయ్యాడని చెప్పాడు.

 అనంతరం స్టేజ్ పైకి వచ్చిన లోబోను ఇంటి సభ్యులకు గుడ్ బై చెప్పి వెళ్లిపోతుండగా.. నాగార్జున చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. లోబోను సీక్రెట్ రూమ్ లోకి పంపుతున్నట్లు చెప్పారు. ఎలిమినేట్ చేసే అధికారం ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే ఉంద‌ని తెలిపాడు. మెజారిటీ ఇంటి సభ్యులు నువ్వు వెళ్లాల‌ని ఓటేసినందున‌ వ‌చ్చేవారం నేరుగా నామినేష‌న్స్‌లో ఉంటావని చెప్పాడు. ఈ సందర్భంగా లోబో భావోద్వేగానికి లోనయ్యాడు. ప్ర‌స్తుతానికి సీక్రెట్ రూంలో ఉంటూ గేమ్‌ని ప‌రిశీలించాలని నాగార్జున లోబోకు సూచించాడు. కాగా, ఈ వారం ఏకంగా 10మంది సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. శనివారం నామినేషన్స్ కు సంబంధించి ఎవరు సేవ్ అయ్యారో నాగార్జున చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టారు. ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు ? అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: సండే ఫన్ డే: ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కేనామ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement