Thursday, April 25, 2024

పేదల యాపిల్‌.. పోషకాలు పుష్కలం

  • సిటీ శివార్లలో గంపలకొద్ది పండ్లు

షాబాద్‌, (ప్రభన్యూస్‌): పేదోడి యాపిిల్‌గా పేరుగాంచింది. మన ఊరు మధురఫలం సీతాఫలం… ఈ చెట్లు ఊరూరా కనిపిస్తాయి. గ్రామ శివారులలో, పొలిమేరల్లో, గుట్టల్లో, చెలగట్ల విరివిగా పెరుగుతాయి. నిండుగా పూత పూసి కమ్మటి పండ్లను ఇస్తాయి… నిరుపేద కుటుంబాల బతుకులకు జీవనాధారమైతే… గొప్పోడికి తియ్యటి ఫలహారమవుతోంది… ఎన్నో పోషక విలువలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్న ఈ చెట్టుకు వాన నీరే ప్రాణ ధారం… ఈ చెట్లకు ఎలాంటి తెగులు సోకదు… ఏ పురుగు వీటి ఆకులను తినదు… ఎలాంటి పురుగుల మందులు ఈ చెట్లకు అవసరం ఉండదు.. ఇవి సంవత్సరాంతం ఆరోగ ్యంగా ఉంటూ.. నిండుగా పూత పూసి కమ్మని పండ్లను కాస్తాయి. రసాయనాల జాడ లేని మధురమైన సీ తాఫలాలను అందిస్తాయి.. తనను ఆదరించిన వారి కడుపు నిండపడమే జీవనం గమనం… అంటోంది. సీతాఫలం.. పోషక విలువలు పుష్కలంగా ఉన్న సీతాఫలాలను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. షాబాద్‌ మండల పరిధిలోని సీతాాంంపూర్‌ వద్ద కొంత మంది మహిళలు కుటుంబ పోషక కోసం ఈ పండ్లను అమ్ముతూ… జీవనం సాగిస్తున్నారు. సీజన్‌ స మయంలో కాస్తున్న కాయలను అడవుల నుంచి తెచ్చి పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అయితే అశించిన స్థాయిలో చెట్లకు కాయలు కాయలేదని రైతులు చెబు తున్నారు. ప్రస్తుతం పండ్ల ు చాలా తక్కువగా ఉండటంతో వాటికి బాగా డిమాండ్‌ ఏర్పడింది. ఒక చిన్న బుట్టుకు రూ. 200 నుంచి 400 వరకు తీసుకుంటున్నారు.

పోషక విలువలు పుష్కలం.
పోషకాలు అధికంగా ఉండటం, సీతాఫలం పండు కూడా తీయ్యగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ పండును అమితంగా ఇష్టపడుతుంటారు. మాంసకృతులు, పీచు, ఖనిజ లవణాలు, వి టమిన్‌లు, శారీరానికి శక్తి నిచ్చె కొవ్వు పుష్కలంగా ఉంటాయి. ఇందులో లభించే మెగ్నేషియం శరీరం పనితీరు మెరుగుపర్చి గుండెజబ్బుల నుంచి కాపాడుతుంది. సీజన్‌ను బట్టి వచ్చే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ క చ్చితంగా తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు.

సీతాఫలం అడ్డా… సీతారాంపూర్‌ గడ్డ….
ప్రతి ఏడాది సీజన్‌లో వచ్చే పండ్లను అమ్మడానికి సీతారాంపూర్‌ చౌరస్తా అడ్డగా మారింది. మండలానికి చుట్టుపక్కల ఉన్న నరెగడ్లగూడ, నాగర్‌కుంట, మాచన్‌పల్లి, కుమ్మరిగూడ, అంతారం, చర్లగూడ, కేసారం, తిర్మలాపూర్‌ తదితర గ్రామాల నుంచి రైతులు, మహిళ, రైతులు తెచ్చి ఇచ్చి విక్రయిస్తున్నారు. పట్టణంలో సీజన్‌ పండ్లు కావాలంటే ఎవరైనా ఈ ప్రాంతానికి రావాల్సిందే… ఉదయం వేళలో ఆ రోడ్డు పూర్తిగా రద్దీగా మారుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement