Monday, April 29, 2024

బిగ్ బాస్5 బ్యూటీ ‘సిరి హ‌న్మంత్’ కి క‌రోనా

సిరి హ‌న్మంత్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప‌రిచిత‌మే. బిగ్ బాస్5 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది ఈ బ్యూటీ. పలు షార్ట్ ఫిల్మ్, సినిమాల్లో కూడా మెరిసింది. కాగా తాను క‌రోనా బారిన పడ్డాన‌ని తెలిపింది సిరి. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ గా నిర్దారణ అయింద‌న్న విషయాన్ని బిగ్‌ బాస్‌ బ్యూటీ స్వయంగా సోషల్‌ మీడియాలో తెలిపింది. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్న సిరి… తనను ఈ మధ్య కాలంలో కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది. తాను త్వరలోనే కోలుకుని మళ్లీ మీ ముందుకు వస్తానని వివ‌రించింది. కాగా.. టాలీవుడ్‌ లో ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement