Saturday, May 28, 2022

ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్‌.. ఏప్రిల్లో రావ‌డం గ్యారెంటీ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల విషయంలో అభిమానులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో 2020 జూలైలో విడుదల కావాల్సిన సినిమాని ఇంకా విడుదల చేయకపోవడంతో అభిమానులు దర్శక నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. జనవరి 7 2022న సినిమా ఇక విడుదల అవుతుంది అని అనుకుంటూ ఉండగా కొత్త సంవత్సరం రాగానే సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్రనిర్మాతలు ప్రకటించడం అభిమానులను మరింత కృంగ తీసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

“దేశ వ్యాప్తంగా ఉన్న ప్యాన్డమిక్ పరిస్థితులు చక్కబడితే థియేటర్లు మళ్ళీ ఫుల్ కెపాసిటీతో ఓపెన్ అయితే, మేము సినిమాని మార్చి 22 2022న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ అప్పటికి కుదరకపోతే ఏప్రిల్ 28 2022న విడుదల చేస్తాము” అని చిత్ర బృందం ఒక ఫోటో ని విడుదల చేస్తూ ప్రకటించింది. దీంతో అభిమానులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. మరి ఈ సినిమా మార్చిలో విడుదల అవుతుందా లేక ఏప్రిల్ దాకా ఎదురు చూడాలని ఇంకా తెలియాల్సి ఉంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సముతిరఖని, అజయ్ దేవగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement