Thursday, May 16, 2024

బీఆర్ఎస్ పార్టీకి ఊరట – కారును పోలిన నాలుగు సింబల్స్ ను తొలగింపు

న్యూ ఢిల్లీ – ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో జరిగిన నష్టాన్ని బీఆఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.ఫలితంగా ఈ సారి జారీ చేసిన గుర్తుల జాబితాలో బీఆర్ఎస్ ఆక్షేపించిన గుర్తులను ఇటు తెలంగాణలోపాటు, అటు ఏపీలోనూ ఎవరికీ కేటాయించకూడదంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం ఆటోరిక్షా, హ్యాట్(టోపీ), ఇస్ట్రీ పెట్టే, ట్రక్ గుర్తులను నిషేధిస్తూ నోటిఫికేషన్ లో పేర్కొంది. మొత్తం 193 గుర్తులను జాబితాలో పొందుపరిచింది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పార్టీలను ఈసీ గుర్తించింది.

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి కారు గుర్తు, ఏఐఎంఐఎం పార్టీకి గాలిపటం గుర్తు, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్పార్ సీపీ)కి సీలింగ్ ఫ్యాన్ గుర్తును ఖరారు చేస్తూ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఏపీ విషయానికొస్తే కేవలం రెండే రెండు పార్టీలను ఎన్నికల సంఘం గుర్తించింది. వైఎస్పార్ సీపీకి సీలింగ్ ఫ్యాన్, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఖరారు చేసినట్లు ఈసీ పేర్కొంది

Advertisement

తాజా వార్తలు

Advertisement