Friday, May 3, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ఈ నేప‌థ్యంలో బంగారం, వెండి రేట్లు పడిపోవడం సానుకూలాంశం అనే చెప్పాలి. ఇక అంతర్జాతీయంగా కూడా రేట్లు భారీగా పడిపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ సహా దేశీయంగా హైదరాబాద్, దిల్లీ వంటి చోట్ల లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశీయంగా కూడా బంగారం రేట్లు పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే రూ. 450 పతనమైంది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల బంగారం రేటు భాగ్యనగరంలో రూ.56,300కు చేరింది. ఇదే సమయంలో 10 గ్రాముల గోల్డ్ రేటు 24 క్యారెట్స్‌కు హైదరాబాద్‌లో రూ.490 పడిపోయి ఇప్పుడు రూ.61,420 మార్కుకు చేరింది.

దిల్లీ మార్కెట్‌లో కూడా గోల్డ్ రేట్లు ఇదే రీతిలో పడిపోయాయి. అక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు తాజాగా రూ.450 పడిపోగా.. రూ.56,450కి తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 490 పడిపోయి.. రూ.61,570 వద్దకు చేరింది. బంగారం ధరతో పాటు వెండి రేట్లు తగ్గాయి. దిల్లీలో ఒక్కరోజే వెండి రూ.500 మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం దేశ రాజధానిలో కేజీ సిల్వర్ రేటు రూ.74,600కు చేరింది. హైదరాబాద్‌లో కూడా చాలా రోజులకు సిల్వర్ రేటు భారీగానే తగ్గింది. ఒక్కరోజులో రూ.600 పడిపోయి ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.78,200కు చేరింది. యూఎస్ ఫెడ్ రేట్లకు అనుగుణంగా ఎక్కువగా బంగారం, వెండి రేట్లు కదలాడుతుంటాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధర పడిపోయే అవకాశాలు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement