Thursday, May 16, 2024

గుజ‌రాత్ సీఎంగా భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణం..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల‌లో బీజేపీ రికార్డు మెజారిటీతో సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఏడవ సారి బీజేపీ అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. 60 ఏళ్ల భూపేంద్ర పటేల్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇదే సమయంలో 16 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement