Thursday, May 2, 2024

సిద్దిపేట మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ది యంగ్ మెడికల్ కాలేజ్ : మంత్రి హ‌రీశ్‌రావు

సిద్దిపేట మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ది యంగ్ మెడికల్ కాలేజ్ అని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య‌విద్య‌పై ప్ర‌త్యేక దృష్టి సారించార‌ని,33 జిల్లాల్లో 33 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో మొదటి పీజీ బ్యాచ్ (2022-23) జీజీ స్టూడెంట్స్ ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో మంత్రి హారీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఉస్మానియా లాంటి కాలేజీలకే సంవత్సరానికి మూడు లేదా నాలుగు పీజీ సీట్లు వస్తాయి. కానీ మొదటి సంవత్సరంలోనే సిద్దిపేట మెడికల్ కాలేజీకి రికార్డ్ స్థాయిలో 57 పీజీ సీట్లు సాధించామ‌ని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాడే నాటికీ 5 మెడికల్ కాలేజీలు ఉండగా ఈ ఒక్క సంవత్సరమే 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నామ‌ని తెలిపారు. ప్రస్తుతం 17 ఏర్పాటు చేసుకున్నాము. ఈ సంవత్సరం 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నాము. వచ్చే సంవత్సరం మరో 9 కాలేజీలను ప్రారంభిస్తాము. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement