Monday, May 6, 2024

BCCI: అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు భారీ నజరానా

అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి  దేశానికి మరో ప్రపంచకప్ అందించిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లు ఒక్కొక్కరికీ రూ. 40 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. అలాగే, సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున బహుమతి ప్రకటించారు.

ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు యాష్ ధుల్ నేతృత్వంలోని జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం (ఫిబ్రవరి 6) అభినందించారు.’’ ప్రపంచ కప్‌ను ఇంత అద్భుతంగా గెలుచుకున్నందుకు అండర్ 19 జట్టుకు మరియు సహాయక సిబ్బందికి మరియు సెలెక్టర్‌లకు అభినందనలు. మేము ప్రకటించిన 40 లక్షల నగదు బహుమతి ఒక చిన్న ప్రశంస చిహ్నం, కానీ వారి కృషికి వేల కట్టలేం’’ అని గంగూలీ పేర్కొన్నారు.

కాగా, నిన్న(ఫిబ్రవరి 5) రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో యువ భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 189 పరుగుల టార్గెన్‌ని సునాయ‌సంగా ఛేదించారు. ఈ విజయంతో ఐదో ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత్ జట్టు ఆ లక్ష్యాన్ని 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించేసింది. ఇప్పటి వరకూ 14 అండర్-19 వరల్డ్‌కప్‌లు జరగగా.. భారత్ జట్టు రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఫైనల్లో ఆడి ఐదోసారి విజేతగా నిలిచింది. 2000, 2008, 2012, 2018, 2022లో విజేతగా నిలిచిన యువ భారత్.. 2006, 2016, 2020లో రన్నరప్‌‌గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement