Sunday, May 5, 2024

బంగార్రాజులో రెండు ‘ఐటెం’ సాంగ్స్ : న‌టించేది ఎవ‌రో తెలుసా

ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో ఐటెం సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి. ప్ర‌త్యేక గీతం అంటూ పెట్టిన ఈ పాట‌ల్లో స్టార్ హీరోయిన్స్ సైతం న‌టిస్తుండ‌టం విశేషం. దాంతో ఆ సాంగ్స్ కి ఎన‌లేని క్రేజ్ వ‌స్తుంది. ఈ మ‌ధ్య కాలంలో పుష్ప చిత్రంలో టాప్ న‌టి స‌మంత ఐటెం సాంగ్ లో న‌టించింది. కాగా ఇప్పుడు టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌టిస్తున్న బంగార్రాజు చిత్రంలో ఏకంగా రెండు ఐటెంసాంగ్స్ ఉండ‌నున్నాయ‌ట‌. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది.

కాగా ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య‌, కృతిశెట్టి జంట‌గా న‌టించ‌నున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. కాగా ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ ను ఫరియా అబ్దుల్లాపై చిత్రీకరించారు. మరో ఐటమ్ సాంగ్ లో దక్షా నగార్కర్ (హుషారు .. హోరా హోరీ ఫేమ్) సందడి చేయనుందని అంటున్నారు. త్వరలోనే ఆ పాటను కూడా రిలీజ్ చేయ‌నున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement