Saturday, April 27, 2024

బతుకమ్మను అవమానించిన‌ బండి సంజయ్ .. ఎమ్మెల్సీ క‌విత

బండి సంజయ్ తనని మాత్రమే కాదని బతుకమ్మను అవమానించారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ తన పదవికి మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారన్నారు. గతంలో బతుకమ్మను ఎత్తుకోవడానికి భయపడిన వాళ్లు ఇప్పుడు అవమానిస్తున్నారని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేస్తామని వెల్లడించారు. ప్రధాని మోడీ నుంచి సంజయ్ వరకు మహిళలను అహేళన చేసే విధంగా మాట్లాడుతారని ఆరోపించారు. బెంగాల్ లో మమతను మోడీ హేళన చేస్తే ఏం జరిగిందో తెలియదా అని ప్రశ్నించారు. సరైన సమయంలో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెప్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement