Friday, May 3, 2024

బాల‌య్య అఖండకి – 175రోజులు

హీరో బాల‌కృష్ణ కెరియ‌ర్ లో అఖండ విజ‌యాన్ని అందించింది అఖండ చిత్రం. ఇంతకుముందు బాలకృష్ణ – ద‌ర్శ‌కుడు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’ .. ‘లెజెండ్’ మాదిరిగానే ‘అఖండ’ కూడా సిల్వర్ జూబిలీ మార్క్ ను టచ్ చేసింది. ‘సింహా’ .. ‘లెజెండ్’ ఈ రెండు సినిమాలు కూడా ఎమోషన్ తో కూడుకున్న మాస్ యాక్షన్ సినిమాలే. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగిన పవర్ఫుల్ కథలే. కాగా అఖండ’ క్రితం ఏడాది డిసెంబర్ 2వ తేదీన విడుదలైంది. భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, తాజాగా 175 రోజులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement