Friday, April 26, 2024

రేపు ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ తోక చుక్క దర్శనం..

తోక చుక్క ఒకటి దర్శనం ఇవ్వనుంది. ఇది గ్రీన్‌ కలర్‌లో ఉండటం విశేషం. లియోనార్డ్‌ అనే ఈ తోకచుక్క భూమికి ఎంతో దగ్గరగా రానుంది. డిసెంబర్‌ నెలంతా కనిపిస్తూనే ఉంటుంది.. కానీ స్పష్టంగా మాత్రం రేపు దర్శనం ఇస్తుంది. అత్యంత కాంతివంతమైన తోక చుక్క ఇదే. 2021 జనవరిలో గురు గ్రహం దగ్గర్లో ఉన్నప్పుడు దీన్ని కనిపెట్టారు.

తరలో సూర్యున్ని చేరుకుని.. ఓ చుట్టు చుట్టి.. తిరిగి తన గెలాక్సీ వైపు వెళ్లిపోతుంది. సాధారణంగా తోక చుక్కలు పసుపు రంగులో కనిపిస్తాయి. ఇది మాత్రం ఆకుపచ్చగా దర్శనం ఇవనుంది. ఇలాంటి గ్రీన్‌ కలర్‌ తోక చుక్క భూమికి దగ్గరగా రావడంతో 70వేల సంవత్సరాల్లో ఇదే తొలిసారి. 2022, జనవరి 3న ఇది సూర్యుడి దగ్గరకు వెళ్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement