Friday, May 3, 2024

Breaking: కేబీఆర్ పార్క్‌లో నటిపై దాడి

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌కు వాకింగ్‌కు వెళ్లిన నటి చౌరాసియాపై దాడి జరిగింది. ఈరోజు ఉదయం ఒంటరిగా ఉన్న ఆమెపై దాడిచేసిన దుండగుడు మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో నటికి స్వల్పంగా గాయాలయ్యాయి. చివరికి ఆమె చేతుల్లోంచి ఫోన్ గుంజుకున్న దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం చౌరాసియా 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. గాయపడిన నటి చౌరాసియాను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement