Wednesday, May 22, 2024

సింహగిరి పై పరిశుభ్రత..

సింహాచలం, (ప్రభ న్యూస్‌): సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో పరిశుభ్రత పాటించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సూర్యకళ వర్తకులకు తెలియజేశారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఆమె ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవస్థానం పరిసర ప్రాంతాల్లో నిర్వహించే వారు తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. పుణ్యక్షేత్రం పరిధిలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని ఈ సందర్భంగా తెలిపారు. మార్కెట్‌ పరిసరాల్లో చెత్త చెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు.

వ్యాపారులతో మాట్లాడి పరిసరాలను అపరిశుభ్రం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ దుకాణం వద్ద డస్ట్‌ బిన్‌ ఏర్పాటు- చేసుకోవాలని ఆదేశించారు. తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి దేవస్థానం ఏర్పాటు- చేసిన వాహనంలో వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వద్ద దుకాణం సంఖ్య, యజమాని పేరు తెలియజేసే బోర్డులు ఏర్పాటు- చేసుకోవాలని చెప్పారు. ఇప్పటికే గతంలో అపరిశుభ్రత విషయంపై హెచ్చరించిన నేపథ్యంలో ఇకపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement