Saturday, May 25, 2024

ఏటీఎం సొమ్ముకి రెక్క‌లు.. కోటిన్న‌ర సొమ్ముతో వ్యాన్ డ్రైవ‌ర్ ప‌రార్

ఏటీఎంలో క్యాష్ ని నింపేందుకు వ‌చ్చారు సిబ్బంది. క‌స్టోడియ‌న్ అమ్రేవ్ కుమార్ సింగ్‌, క్యాషియ‌ర్ సోనూ కుమార్, దిలీప్‌కుమార్‌, గ‌న్‌మెన్ సుభాష్ డ్రైవ‌ర్ సూర‌జ్ కుమార్‌లు ఐసీఐసీఐ బ్యాంక్‌కు చేరుకున్నారు. డిపాజిట్ మెషీన్లలో ఉన్న న‌గదును తీసి, ఏటీఎం విత్‌డ్రా మెషీన్ల‌లో పెట్టాల్సి ఉంది. అయితే ద‌న్‌కా చౌక్ వ‌ద్ద పార్కింగ్ స‌మ‌స్య రావ‌డంతో.. డ్రైవ‌ర్ సూర‌జ్ వాహ‌నాన్ని కొంత దూరంలో పార్క్ చేశాడు.క‌స్టోడియ‌న్, క్యాషియ‌ర్ ఇద్ద‌రూ బ్యాంక్‌లోకి వెళ్లి అర‌గంట త‌ర్వాత తిరిగి వాహ‌నం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో క్యాష్ వ్యాన్‌తో పాటు సూరజ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో పాట్నా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సూర‌జ్‌ను ఫోన్‌లో కాంటాక్ట్ అయ్యే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు జీపీఎస్ ద్వారా వాహ‌నాన్ని పోలీసులు ట్రాక్ చేశారు. వాహ‌నాన్ని ఖాళీగా గుర్తించారు. డ్రైవ‌ర్ మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు తేల్చారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా సూర‌జ్ కోసం స్కానింగ్ మొద‌లుపెట్టారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఫింగ‌ర్ ప్రింట్స్‌, శాస్త్రీయ ఆధారాలను సేక‌రించారు. ఆల‌మ్‌గంజ్ పోలీసు స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ రిజిస్ట‌ర్ చేశారు.కాగా ఏటీఎం వ్యాన్ డ్రైవ‌ర్ సుమారు కోటిన్న‌ర న‌గ‌దుతో ప‌రారీ అయ్యాడు. ఈ ఘ‌ట‌న బీహార్ పాట్నాలో ఉన్న ద‌న్‌కా ఇమ్లీ చౌక్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement