Sunday, April 28, 2024

Apple: ​ఐఓఎస్​ 16 అప్డేట్స్​.. ఐక్లౌడ్​ షేర్​ ఫొటో ఆల్బమ్​ ఆప్షన్​ లేట్​ చేస్తున్న కంపెనీ!

స్మార్ట్ ఫోన్​ ధిగ్గజ సంస్థ ఆపిల్​ తన ఐఓఎస్​ని ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 16 బీటా వర్షెన్​లో కొన్ని ఫీచర్లను టెస్ట్​ రన్ కూడా​ చేస్తోంది. అయితే.. ఈ మధ్య జరిగిన ఈవెంట్​ సందర్భంగా ఐఓఎస్​ 16 ఆర్​సీ వెర్షన్​ని రిలీజ్​ చేసింది. కానీ, ఐక్లౌడ్​ షేర్​ ఆప్షన్​ మాత్రం అందులో లేదు. ఈ ఆప్షన్​ సెప్టెంబర్​ 12న వస్తుందని ఇంతకుముందు ప్రకటించింది. కానీ, ఇప్పుడు దాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజా ఐఓఎస్​ 16 బీటా నుంచి కూడా ఈ ఫీచర్​ని తొలగించినట్టు ఆపిల్​ ఇన్​సైడర్​ ద్వారా తెలుస్తోంది.

కాగా, iOS 16 కోసం iCloud షేర్డ్ ఫోటో లైబ్రరీ ఫీచర్‌ను ఈ సంవత్సరం చివర్లో వస్తుందని తన వెబ్​పేజీలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇక.. Apple iOS 16లో భాగంగా iCloud షేర్డ్ ఫోటో లైబ్రరీ ద్వారా ఐఫోన్​లో ఉన్న ఫొటోలు, వీడియోలను మరో ఐదుగురు వ్యక్తులకు ఈజీగా షేర్​ చేసే అవకాశం ఉంటుంది.

ఐక్లౌడ్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉన్న షేర్డ్ ఆల్బమ్‌ల కంటే ఈ ఫీచర్ చాలా డిఫరెంట్​గా ఉంటుందని తెలుస్తోంది. ఫోటోల యాప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న షేర్డ్ ఆల్బమ్‌లతో ఇప్పటికైతే మనం ఎంచుకున్న వ్యక్తులతో మాత్రమే ఫోటోలు, వీడియోలను షేర్ చేయవచ్చు. అవతలి వారు కూడా తమ సొంత ఫొటోలు, వీడియోలు, వ్యాఖ్యలను కూడా యాడ్​ చేయవచ్చు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement