Friday, May 3, 2024

రేపే లంక, పాక్ ఫైన‌ల్ పోరు.. ఆసియాకప్‌ టైటిల్‌ పోరులోపాక్‌ గెలిచేనా?

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం శ్రీలంక- పాకిస్తాన్‌ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరుగనుంది. కీలక మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ఫామ్‌లో కనిపించిన పాక్‌ ఇప్పుడు హైటెన్షన్‌లో ఉంది. ఫైనల్‌కు ముందు ఈ ఒత్తిడిని పాక్‌ ఎలా అధిగమిస్తోందో అని సర్వత్రా ఉత్కంఠత ఉంది. ఇప్పటికే ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న పాక్‌- శ్రీలంక జట్టు శుక్రవారం సూపర్‌ 4లో తమ చివరి మ్యాచ్‌ను ఆడేశాయి. ఈ మ్యాచ్‌లో బాబర్‌ ఆజం నేతృత్వంలోని పాక్‌ జట్టును శ్రీలంక హైరానా పెట్టించింది. మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ శ్రీలంక బౌలర్ల దాడికి తట్టుకోలేక మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 121 పరుగులకే కుప్పకూలింది. వనిందు హంసరంగ మూడు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను బెంబేలెత్తించగా, మహేష్‌ తీక్షణ, ప్రమోత్‌ మదుసన్‌ రెండేసి వికెట్లు తీసి పాకిస్థాన్‌కు తమ బంతుల సత్తాను చూపించారు.

అనంతరం 122 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన శ్రీలంక 17 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని అందుకుని ఆరు పాయింట్లతో సూపర్‌ -4లో అగ్రస్థానం నిలిచింది. ఈ రెండు జట్ల మధ్యే ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. తుదిపోరుకు ముందు పాకిస్తాన్‌ పై ఆధిపత్యం ప్రదర్శించిన దాసున్‌ షనక సేన పూర్తి కాన్ఫిడెన్స్‌లో ఉండగా, పాకిస్తాన్‌ ఒత్తిడిలోకి జారుకుంది. నిజానికి ఈ టోర్నీలో శ్రీలంక ఆటతీరును ప్రశంసించకుండా ఉండలేం. టోర్నీ ప్రారంభంలో అప్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో శ్రీలంక దారుణ ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బోల్తాపడి 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ఆ తర్వాత మాత్రం పడిలేచిన కెరటంలా లంక జట్టు విజృంభించింది. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ముందుకు సాగుతోంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ , అప్గనిస్తాన్‌ , భారత్‌ , పాకిస్తాన్‌ జట్లపై విజయం సాధించి సత్తా చాటింది. మరోవైపు తొలిమ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడిన పాకిస్తాన్‌.. సూపర్‌4లో భారత్‌ పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత అప్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా బయటపడింది. తాజాగా శ్రీలంక చేతిలో ఎదురుదెబ్బ తగిలింది. వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న శ్రీలంక ట్రోఫీపై కన్నేసింది. అవకాశం ఎదురు చూస్తున్న పాక్‌ ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది.

బలా బలాలు

శ్రీలంక పాకిస్తాన్‌ జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచుల్లో ఎదురయ్యాయి. శ్రీలంక 9, పాక్‌ 13 మ్యాచుల్లో విజయ కేతనం ఎగురవేసాయి. దుబాయ్‌లో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా రెండింటిలో శ్రీలంక విజయం సాధించింది.
పాకిస్తాన్‌ ఒక్క విజయంతోనే సరిపెట్టుకుంది. గత ఐదు మ్యాచుల్లో శ్రీలంక నాలుగు మ్యాచుల్లో విజయం సాధించగా, పాకిస్తాన్‌ ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. యూఏఈలో జరిగిన ఆరు మ్యాచుల్లో శ్రీలంక రెండు, పాకిస్తాన్‌ 4 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇక ఆసియాకప్‌ విషయానికి వస్తే 2016,2012,2000 ఆసియాకప్‌లో రెండుసార్లు, 1986లో ఒకసారి మొత్తంగా 5 సార్లు శ్రీలంకపై పాకిస్తాన్‌ విజయం సాధించింది. ఆసియాకప్‌లో పాక్‌ పై శ్రీలంక డామినేషన్‌. 2014లో రెండుసార్లు, 2010, 2008, 2004, 1997, 1995లో మొత్తంగా ఏడుసార్లు విజయం సాధించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement