Monday, April 29, 2024

వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పల్కిన ఆస్ట్రేలియా కెప్టెన్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న పించ్‌

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే అన్ని ఫార్మట్ల నుంచి రిటైర్‌ అవుతాడా లేదా అనే విషయంపై ఇంకాస్పష్టత ఇవ్వలేదు. రింకీ పాంటింగ్‌, డేవిడ్‌ వార్నర్‌ తర్వాత ఆస్ట్రేలియా తరపున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడుగా ఆరోన్‌ ఫించ్‌ క్రికెట్‌ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. కాగా కెప్టెన్‌గా జట్టును విజయాల బాటలో నడిపిస్తున్న ఫించ్‌ వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. గత తన ఏడు వన్డే ఇన్నింగ్స్‌లలో 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్‌ సారథ్యంలోనే ఆస్ట్రేలియా జట్టు తమ తొలి టి 20 ప్రపంచకప్‌ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది. ఆదివారం ఫించ్‌ న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్‌ ఆడనున్నాడు. టి 20లపై దృష్టి కేంద్రీకరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫించ్‌ మీడియాకు తెలిపాడు.

కోహ్లితో అనుబంధం

కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పనున్న ఫించ్‌పై టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా కోహ్లి ఫించ్‌తో ఉన్న అనుబంధాన్ని ఎమోషనల్‌గా పేర్కొన్నాడు.
”వెల్‌ డన్‌ ఫించ్‌ నీకు ప్రత్యర్థిగా ఇన్ని సంవత్సరాలు క్రికెట్‌ ఆడటం ఎప్పటికీ మరచిపోనూ. అలాగే ఐపిఎల్‌లో ఆర్‌ సిబి తరపున ఇద్దరం ఒకే జట్టుకు ఆడడం మంచి అనుభూతి కలిగించింది. ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ టి 20 క్రికెట్‌.. నీ తర్వాతి లైఫ్‌ను సాఫీగా సాగించు” అంటూ కోహ్లి పేర్కొన్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement