Friday, May 3, 2024

ఏపీ కేబినెట్ భేటీ – ఎప్పుడంటే

ఏపీ కేబినెట్ భేటీ తేదీ వాయిదా ప‌డింది. ఈ నెల 7న ఉదయం 11 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినా.. ఆ తర్వాత దానిని మధ్యాహ్నానికి మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులిచ్చారు. సీఎంకు కొన్నిచోట్ల పర్యటనలు ఉండడం వల్లే సమావేశాన్ని కొన్ని గంటల పాటు వాయిదా వేశార‌ట‌. వాస్తవానికి ఈ నెల 6న నరసరావుపేటలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే, ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో వాలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని ఈ నెల 7న ఉదయానికి మార్చారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశ సమయాన్ని మార్చారని అంటున్నారు. సమావేశం జరిగిన ఆ రోజే.. పదవి పోయిన మంత్రుల పేర్లను సీఎం జగన్ ప్రకటించే అవకాశముంది. ఆరోజే వారితో రాజీనామా చేయించి.. తెల్లారి అంటే ఈ నెల 8న గవర్నర్ వద్దకు వెళ్లి కొత్త వారిని నియమించేందుకు అనుమతి కోరనున్నట్టు సమాచారం. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే అదే రోజు కొత్త మంత్రులకు సమాచారం ఇవ్వనున్నట్టు స‌మాచారం. ఆ తర్వాత ఈ నెల 11న ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించబోతున్నారట‌. వెలగపూడిలో ఉన్న సచివాలయ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement