Saturday, May 4, 2024

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 64,461 పరీక్షలు నిర్వహించగా.. 1,321 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ మహమ్మారి బారినపడి మరో 19 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,807కి చేరింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,10,566 మంది వైరస్‌ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 1,499 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,81,906కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 12, చిత్తూరు జిల్లాలో 225, తూర్పుగోదావరి జిల్లాలో 218, గుంటూరు జిల్లాలో 128, కడప జిల్లాలో 67, కృష్ణాజిల్లాలో 153, కర్నూలు జిల్లాలో 16, నెల్లూరు జిల్లాలో 139, ప్రకాశం జిల్లాలో 118, శ్రీకాకుళం జిల్లాలో 30, విశాఖపట్నం జిల్లాలో 42, విజయనగరం జిల్లాలో 42, పశ్చిమగోదావరి జిల్లాలో 142 పాజిటివ్ కేసులు మోదయ్యాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,64,71,272 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇది కూడా చదవండిః డెల్టా వేరియంట్‌తో ముప్పు రెండు రెట్లు ఎక్కువ

Advertisement

తాజా వార్తలు

Advertisement