Wednesday, May 8, 2024

అప్పుల్లో ఏపీ నంబర్‌వన్

2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే ఏపీ ప్రభుత్వం భారీ రుణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నెల వరకు(11 నెలల్లో) రూ.79,191 కోట్ల అప్పులు తీసుకున్నట్లు కాగ్ నివేదికలో వెల్లడైంది. దేశంలో ఆర్థికంగా, జనాభా పరంగా పెద్దగా ఉన్న 14 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో పొందుపరిచిన అంచనాలతో పోలిస్తే 63.97% అధికంగా రుణాలు తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఉన్న అప్పులభారంతో పోల్చితే ఈసారి 52 శాతం పెరిగింది. ఆదాయం కంటే అప్పులే ఎక్కువున్నట్లు తేలింది. కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయాలు దాదాపు ఒకేస్థాయిలో ఉన్నా అప్పుల విషయంలో జగన్ సర్కారు నంబర్‌వన్‌గా ఉండటం గమనార్హం. కాగ్ లెక్కల ప్రకారం ఆర్థిక ఏడాదిలోని గత 11 నెలల్లో నెలకు సగటున ఏపీ ప్రభుత్వం రూ.7,199 కోట్లు రుణం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement