Monday, April 29, 2024

బ‌హిరంగంగా తుపాకులు క‌లిగి ఉండ‌టం అమెరిక‌న్ల హ‌క్కు- సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బ‌హిరంగంగా తుపాకులు క‌లిగి ఉండ‌టం అమెరిక‌న్ల హ‌క్కు అని ఆ దేశ సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అమెరికాలో ఇప్ప‌టికే గ‌న్ క‌ల్చ‌ర్ తో ప‌లువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు..ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌లు శోచ‌నీయంగా మారింది.6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, బోస్టన్ తదితర పెద్ద నగరాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ పౌరులు తమ వెంట తుపాకులు తీసుకెళ్లొచ్చని, వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకి కలిగి ఉండడం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తీర్పులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యూయార్క్ గతంలో చేసిన చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న బైడెన్ సర్కారు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement