Saturday, April 27, 2024

Big Story: వ‌డ్ల కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు.. రైతుల కోసం సంగారెడ్డి జిల్లాలో కంట్రోల్​ రూం ఏర్పాటు!

సంగారెడ్డి, అక్టోబర్‌ 29 (ప్రభ న్యూస్‌) : వానకాలంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యం కొనుగోలుకు అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం వాన కాలం కంటే ఈ సారి అధికంగా వరి సాగు విస్తీర్ణం ఉండడంతో అందుకు అనుగుణంగా ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులు ఇప్పటినుంచే ముందస్తు ఏర్పాట్లు- చేపడుతున్నారు. జిల్లాలో 247కేంద్రాలు ఏర్పాటు- చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ-గ్రేడు రకం ధాన్యంకు 2,060, సాధారణ రకం ధాన్యంకు 2040 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లాలో రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు- పూర్తి చేసారు. ఇప్పటికే జిల్లాలో 257కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు- చేసారు. ఇందులో డీసీఎంఎస్‌, మార్కెట్‌ కమిటీ-లు, పీఏసీఎస్‌లు, ఐకేపీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు అవసరమైన ప్రతిచోట ఏర్పాటు- చేయను న్నారు. ఇందుకుగాను గ్రామ స్థాయిలో గత వానకాలం సీజన్‌ ధాన్యం కొనుగోలు ఎక్కడెక్కడ ఏర్పాటు- చేయడం జరిగిందనేది గుర్తించి సంబంధిత గ్రామాల్లో ఈసారి సైతం ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు. తద్వారా రైతులు ఇతర గ్రామాలకు వెళ్లకుండా తమ గ్రామంలోనే వరి ధాన్యం విక్రయించేలా ఏర్పాట్లు- చేపడు తున్నారు.

2 లక్షల 52 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అంచనా..
జిల్లాలో 2 లక్షల 52 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు- చేస్తున్నారు. రైతులు కనీస మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలలో అమ్ముకునేలా అన్ని ఏర్పాట్లు- ఉండేలా చర్యలు తీసుకుంటు-న్నారు. . జిల్లాలో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఏ-గ్రేడు రకం ధాన్యం కు 2,060, సాధారణ రకం ధాన్యం కు 2040 రూపాయల మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాలు, ఐ.కె.పి, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 257 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు- చేసారు.

- Advertisement -

ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామానికి ఒకటి, పెద్ద గ్రామం అయితే అవసరం మేరకు రెండు కేంద్రాలు ఏర్పాటు- చేసుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించారు. మరోవైపు వర్షం కురిస్తే ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్‌లు సైతం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటు-లో ఉంచనున్నారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ప్యాడి క్లీనర్లు, తేమను కొలిచే యంత్రాలు, డిజిటల్‌ కాంటాలు, గోనె సంచులు అందుబాటు-లో ఉంచారు. కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌కు అందజేసేందుకు సైతం అధికారులు చర్యలు చేపట్టారు. తద్వారా కొనుగోలు కేంద్రాలలో ఎక్కువ స్టాకు ఉండకుండా ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు ధాన్యం చేరవేయనున్నారు. అలాగే రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నాలుగు రోజుల్లోపే రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటు-న్నారు

ఎప్పటికప్పుడు ధాన్యం రైస్‌ మిల్లు లకు తరలింపులు
ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించడానికి వీలుగా ట్రాన్స్పోర్ట్‌ కాంట్రాక్టర్స్‌ అవసరమైనన్ని లారీలను నడపాలని కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని నాలుగు గంటల లోపు లోడింగ్‌ చేసి , రైస్‌ మిల్లుల వద్ద 6 గంటల లోపు ఎప్పటికప్పుడు అన్‌ లోడ్‌ చేసి రైస్‌ మిల్లుల కాంటాల వద్ద తూకంలో అవకతవకలు జరగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు- చేశారు. ఇందుకు ముందుగా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎప్పటికప్పుడు లారీలలో తరలించుటకు హమాలీలను ఏర్పాటు- చేసారు. రైతులకు డబ్బులు సకాలంలో వారి ఖాతాలో జమ చేయుటకు ఏ రోజు కారోజు కొనుగోళ్లకు సంబంధించిన ట్రక్‌ షీట్‌, టాబ్‌ ఎంట్రీ- చేయానున్నారు. మిల్లులలో ధాన్యం అన్‌ లోడింగ్‌ సమస్య రాకుండా తగు చర్యలకు ఏర్పాట్లు- చేశారు.

రైతులు 17శాతం తేమ మించకుండా తెస్తే ప్రయోజనం
17 శాతం తేమ మించకుండా, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. సహాయ వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో సమన్వయం చేసుకుంటూ కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చేది ఖచ్చితమైన వివరాలు అందించేందుకు చర్యలు చేపట్టారు. రోజువారి నివేదికను ఆయా అధికారులు, సివిల్‌ స్లప స్‌ కార్పొరేషన్‌ డిఎం కన్‌ సాలిడే-టె-డ్‌ చేసిన నివేదిక ఇవ్వానున్నారు.

ధాన్యం కొనుగోలు ఫిర్యాదులకు కంట్రోల్‌ రూం
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఫిర్యాదు, సహాయానికి సంగారెడ్డి కలెక్టరేట్‌ లో కంట్రోల్‌ రూం ఏర్పాటు- చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏవేని సమస్యలు ఎదురైతే రైతులు సంగారెడ్డి కలెక్టరేట్‌ లో ఏర్పాటు-చేసిన కంట్రోల్‌ రూం హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 08455-272233 కు ఫోన్‌ చేసి తెలియజేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కంట్రోల్‌ రూమ్‌ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది. కంట్రోల్‌ రూమ్‌ లో రెండు షిప్ట్‌n లలో పనిచేసేలా సిబ్బందిని ఏర్పాటు- చేశారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంఛార్జీలకు ఫోన్‌ చేసి ఆయా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, గన్ని బ్యాగ్స్‌, ట్రాన్స్పోర్టేషన్‌, అన్‌ లోడింగ్‌, రైతుల వివరాల నమోదు,చెల్లింపులు, నాణ్యత, తేమ శాతం, వేయింగ్‌ మిషన్స్‌, తదితర విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, సమస్యలు ఉంటే సూపర్వైజింగ్‌ అధికారులకు తెలియజేస్తారు. వెంటనే ఆయా సూపర్వైజర్‌ అధికారులు సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా ఆయా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement