Saturday, April 27, 2024

ముంబై వీధుల్లో – ఆలియా, చ‌ర‌ణ్ ల హోర్డింగ్స్

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం సూప‌ర్ హిట్ట్ అవ్వ‌డంతో ఆ చిత్రంలోని స్టార్స్ కి ఎన‌లేని పేరు వ‌చ్చింది. కాగా స్టార్ న‌టులు ఆలియాభట్-రామ్ చరణ్ కు చెందిన హోర్డింగ్స్ ముంబై రోడ్లపై ఓ రేంజ్ లో చక్కెర్లు కొడుతున్నాయి. ముంబై లో ఎక్కడ చూసినా జంటగా వీరిద్దరి హోర్డింగ్ లే కనిపిస్తున్నాయి. ఓ శీతల పానియాల కంపెనీకి అలియాభట్- చరణ్ బ్రాండ్ వేర్వేరు భాషల్లో అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా బిగ్ హిట్ కావ‌డంతో ..ఇద్దరికీ మంచి పేరు రావడంతో సదరు కంపెనీ తమ బ్రాండ్ ని ప్రచారం చేసుకుంటోంది. ముంబై సిటీని మొత్తం రౌండప్ చేసి హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement