Saturday, May 4, 2024

యెమెన్ జైలుపై వైమానిక దాడి – 100మందికి పైగా మృతి

సౌదీ సంకీర్ణ సేన‌లు యెమెన్ జైలుపై వైమానిక దాడికి దిగారు. ఈ ఘ‌ట‌న‌లో 100మందికి పైగా మ‌ర‌ణించారు. ఇంకా మృతుల సంఖ్య పెర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఈ మేర‌కు హృద‌య విదార‌కంగా ఉన్న దృశ్యాల‌ను హౌతీ రెబ‌ల్స్ విడుద‌ల చేసింది. హౌతీ రెబల్స్ సొంత నగరమైన సాదాలో జరిగిన ఈ దాడిపై యెమెన్‌లోని రెడ్‌క్రాస్ సంస్థ అంతర్జాతీయ ప్రతినిధి బషీర్ ఒమర్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు వందమందికిపైగా మృతి చెందారన్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని సహయక సిబ్బంది వెలికి తీస్తున్నారు. ఈ ఘటన తర్వాత అక్కడ పరిస్థితులు హృదయ విదారకంగా మారాయి.

క్షతగాత్రులను, మృతదేహాలను వెలికి తీస్తున్న వీడియోలను హౌతీ రెబల్స్ విడుదల చేశారు. సౌదీ సంకీర్ణ దళాలు జరిపిన ఈ దాడికి సంబంధించిన వీడియోలు హృదయ విదారకంగా ఉన్నాయి. మరోవైపు, టెలి కమ్యూనికేషన్‌ హబ్‌పై దాడికి సంబంధించిన వీడియోలను విడుదల చేసిన రెబల్స్.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. దాడి తర్వాత సాదా ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయంది. ఇప్పటి వరకు 200 మంది చేరారు. యూఏఈపై హౌతీలు డ్రోన్ దాడికి పాల్పడిన ఐదు రోజుల తర్వాత ఈ వైమానిక దాడి జరగడం గమనార్హం. హౌతీల డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ సారథ్యంలోని సంకీర్ణంలో భాగమైన యూఏఈ 2015 నుంచి హౌతీ రెబల్స్‌తో పోరాడుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement