Friday, April 19, 2024

‘గుడ్ ల‌క్ స‌ఖి’ రిలీజ్ ఎప్పుడంటే

న‌గేశ్ కునూర్ డైరెక్ష‌న్ గుడ్ ల‌క్ స‌ఖి చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మించారు. ఈ సినిమా, విడుదలకి ముస్తాబై చాలాకాలమే అయింది. అయితే సరైన విడుదల తేదీ దొరక్కపోవడం వలన ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఓటీటీలో విడుదలవుతుందనే టాక్ కూడా బలంగానే వినిపించింది. ఈ నేపథ్యంలో థియేటర్లకు ఈ సినిమా వస్తుందనే విషయాన్ని స్పష్టం చేయడమే కాదు, రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తానికి మరో వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆది పినిశెట్టి .. జగపతిబాబు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement