Tuesday, May 21, 2024

మానేరు రివర్ ఫ్రంట్ లో మరో ముందడుగు : రూ.310 కోట్లతో టెండర్లకు రంగం సిద్ధం

కరీంనగర్ పట్టణంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతల పెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) ప్రాజెక్టులో మరో ముందుడుగు పడింది. మానేరు తీరంలో నిర్మించతలపెట్టిన రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి నీటిపారుదల శాఖ పచ్చజెండా ఊపింది. మొత్తం రూ.410 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నఈ ప్రాజెక్టులో రూ.310 కోట్లు నీటిపారుదల శాఖ, మరో రూ.100 కోట్లు పర్యాటకశాఖ భరిస్తాయి. మొత్తం 10కిలోమీటర మేర మానేరు తీరం సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. అందులో భాగంగా పనిని రెండు దశల్లో చేపడతారు. మొదటిది రూ.9.75 కి.మీ మేర అభివృద్ధి చేయనున్నారు. రెండో దశలో మిగిలిన 6.25 కి.మీ మేర సుందీరకరణ పనులు చేస్తారు.
నీటిపారుదల శాఖ ఆమోదం :
లోయర్ మానేరు డ్యాం దిగువ భాగం నుంచి తీగల వంతెన పక్కనే ఉన్న రెండో చెక్ డ్యాం వరకు తొలుత పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం కావాల్సిన రూ.310.61 కోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు నీటిపారుదల శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా నదీ తీరానికి ఇరువైపులా (లోయర్ మానేరు గేట్ల నుంచి తీగల వంతెన పక్కనే ఉన్న రెండో చెక్ డ్యాం వరకు) దాదాపు 10 నుంచి 14 అడుగుల ఎత్తైన రిటెయినింగ్ వాల్, మధ్యలో ఫీడర్ కెనాల్ నిర్మించనున్నారు. ఈ కెనాల్ ద్వారా రివర్‌ ఫ్రంట్ నీరు అందించనున్నారు. ఈ మేరకు టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలియజేస్తూ నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి గత వారమే ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉన్నా.. సాంకేతిక కారాణాల వల్ల వాయిదా పడింది. ఈ ఆదేశాలతో ఇక టెండర్‌ పనులు ఊపందుకోనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement