Friday, April 19, 2024

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో అఖండ – ఫ్యాన్స్ కి పండ‌గే

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి, హీరో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం అఖండ‌. ఈ చిత్రం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ప్లాట్ ఫార్మ్ పై వ‌రల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు స్ట్రీమింగ్ కానుంది. “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో ఈ సమయానికి సినిమా చూస్తే అఖండ కధానాయకుడు నందమూరి బాలకృష్ణ ను కలిసే అవకాశాన్ని కూడా కొంతమందికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కల్పిస్తోంది.అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేయబోతోంది. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జగపతి బాబు, శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ , సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఇంట్రెస్టింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే లతో ప్రతి సన్నివేశంలో వేగం కనిపించే ఈ సినిమా “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” ప్రేక్షకులకు కనువిందు చేయ‌నుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement