Wednesday, May 8, 2024

త‌మిళ న‌టుడిని పెళ్లాడ‌నున్న న‌టి ‘విమ‌లా రామ‌న్’

నాలుగు ప‌దుల వ‌య‌స్సుకి చేరువ‌యింది న‌టి విమలారామ‌న్. మోడల్‌గా కెరీర్ ఆరంభించి తరువాత హీరోయిన్‌గా మారింది. మలయాళం ఇండస్ట్రీలో నటిగా ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన విమలా రామన్ ..ఆతరువాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.
తెలుగులో గాయం-2, చట్టం, ఎవరైనా.. ఎపుడైనా లాంటి సినిమాలతో లతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. విమలా రామన్‌కు సంబంధించిన ఓ న్యూస్ కోలీవుడ్ లో తెగ హల్‌చల్ చేస్తోంది. విమలా రామన్ పెళ్లి చేసుకోబోతోందట. అది కూడా లవ్ మ్యారేజ్. వినయ్ రాయ్ అనే తమిళ నటుడిని విమలా రామన్ ప్రేమిస్తోంది. గత కొన్నేళ్లుగా అతడితో డేటింగ్ చేస్తుంది. ఈ లవ్‌బర్డ్స్ తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వినయ్ రాయ్, విమలా రామన్ చాలా సార్లు జంటగా మీడియా కంట కూడా పడ్డారు. మాల్దీవుల్లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఈ లవ్ బర్డ్స్ సోషల్ మీడియాలో అనేకసార్లు వేర్వేరుగా అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నారటి తెలుస్తోంది..సన్నిహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం పెళ్లి జరిగే తేదీని త్వరలో ఈ జంట స్వయంగా అధికారికంగా ప్రకటిస్తారట. అయితే.. ఈ జంట పెళ్లి చేసుకుంటరా లేదా అనేది మాత్రం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement