Sunday, April 28, 2024

Breaking: ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా

పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 13 జిల్లాల ఏర్పాటుతో 26 జిల్లాల నుంచి పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. గిరిజన ప్రాంతాలను కలిపి ఒకేజిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో 2 జిల్లాలు ఏర్పాటు చేశామన్న మంత్రి.. కొత్త జిల్లాపై సీఎం జగన్ ఆలోచిస్తున్నారని వెల్లడించారు.

కాగా, ఏపీలో 26 జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు అని స్పష్టం చేశారు. గతంలో ఉన్న జిల్లాలు యథాతధంగానే ఉంటాయని తెలిపారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని చెబుతూ.. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement