Monday, April 29, 2024

స‌మంత‌, చైత‌న్య ఎందుకు విడిపోయారో తెలియ‌ద‌న్న నాగార్జున‌

న‌టులు స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఫ‌స్ట్ విడాకుల‌ను కోరింది స‌మంత అని నాగార్జున తెలిపారు. నాగ‌చైత‌న్య , స‌మంత నిర్ణ‌యాన్ని గౌర‌వించే విడాకుల‌కు ఆమోదం తెలిపాడ‌ని వివ‌రించారు. సామ్–చైతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి నాలుగేళ్ల వివాహబంధంలో విడిపోయేంతటి పెద్ద సమస్యేంటో తనకూ ఇప్పటికీ తెలియదన్నారు. గత ఏడాది నూతన సంవత్సర వేడుకలనూ కలిసే జరుపుకొన్నారన్నారని గుర్తు చేశారు. ఆ తర్వాతే వారి మధ్య సమస్యలు వచ్చాయని, అవేంటో తనకు ఇంకా తెలియదని అన్నారు. అయితే, విడాకుల విషయం తనతో చెప్పడానికి చైతూ ఎంతో ఆవేదన చెందాడని, తన గురించే ఎక్కువ బాధపడ్డాడని వివరించారు. ఆ విషయాన్ని తానెలా తీసుకుంటానోనని కలత చెందాడన్నారు. కుటుంబ పరువు, మర్యాద ఏమవుతుందోనని మదనపడ్డాడని వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement