Saturday, May 4, 2024

Big Story: తెరపైకి మళ్లీ ఎల్​టీటీఈ.. నకిలీ పాస్​పోర్టులతో యాక్టివిటీస్​.. రంగంలోకి ఎన్​ఐఏ

నకిలీ పాస్​పోర్ట్​లతో దేశం దాటేందుకు యత్నిస్తున్న ముఠాలపై నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ (NIA) దర్యాప్తును స్పీడప్​ చేసింది. గత ఏడాది అక్టోబర్​లో నకిలీ పాస్‌పోర్ట్ ల విషయంలో ముగ్గురిని అరెస్టు చేశారు. దానికి సంబంధించి కీలక సమాచారం రావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)తో సహా కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి.  తమిళనాడు పోలీసుల విచారణలో నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్ వెనుక క్రియాశీల లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు తేలింది. చెన్నైలో తమిళనాడు పోలీసు ‘క్యూ’ బ్రాంచ్ లెచ్చుమనన్ మేరీ ఫ్రాన్సిస్కాను గత అక్టోబర్లో అరెస్టు చేసింది. నకిలీ ఇండియన్​ పాస్‌పోర్ట్ తో శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కుతుండగా అతనితోపాఉ శ్రీలంక జాతీయుడిని మధురై విమానాశ్రయంలో తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు స్పానిష్ పాస్‌పోర్టు నకిలీదని తేలడంతో తిరుచ్చి విమానాశ్రయంలో మరో వ్యక్తిని అరెస్టు చేశారు. రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఈ అరెస్టులన్నీ కేంద్ర సంస్థల దర్యాప్తు తీరునే మార్చేశాయి.  వీటన్నిటిపై జనవరి 18న ప్రధాన భారత కేంద్ర ఏజెన్సీ అయిన NIA  చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, పాస్‌పోర్ట్ ల చట్టం, విదేశీయుల సవరణ చట్టం, భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసింది.

నకిలీ పాస్‌పోర్టు రాకెట్‌పై విచారణ..

అనేక బ్యాంకుల నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి నకిలీ భారతీయ గుర్తింపులు, భారతీయ పాస్‌పోర్ట్ లను ఉపయోగించడంపై ఏజెన్సీ దర్యాప్తు చేసింది. ఎల్టీటీఈ ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ముంబై ఫోర్ట్ బ్రాంచ్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసేందుకు నకిలీ పాస్‌పోర్ట్ లు , నకిలీ పత్రాలను ఉపయోగించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల ఆధారంగా తమిళనాడు పోలీసుల నుండి కేసును NIA స్వీకరించింది.  లెచుమనన్ మేరీ ఫ్రాన్సిస్కా, కె బాస్కరన్, జాన్సన్ శామ్యూల్,  ఎల్ సెల్లముత్తు అనే ఐదుగురు నిందితులపై ఎన్​ఐఏ దర్యాప్తు ప్రారంభించింది.

భారతదేశంలో ఎల్టీటీఈ కార్యకలాపాలను పరిశీలించేందుకు ఎన్ఐఏను రప్పించడం ఇది రెండో కేసుగ చెప్పుకోవచ్చు. అంతకుముందు ఎల్‌టిటిఇ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ 47 ఏళ్ల సతకునం అకా సబేసన్‌ను పాకిస్తాన్ నుండి శ్రీలంకకు ఆయుధాలు,  మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై NIA అతడిని చెన్నైలో అరెస్టు చేసింది. మరో ఇద్దరు శ్రీలంక జాతీయులు, 35 ఏళ్ల చిన్నసురేష్ , 25 ఏళ్ల సౌందరరాజన్‌లను కూడా సతకూనంతో పాటు అరెస్టు చేశారు. గత ఏడాది మార్చిలో లక్షద్వీప్ సమీపంలోని మినికాయ్ కోస్ట్ లో ఆరుగురు శ్రీలంక పౌరులను కోస్ట్​ గార్డ్స్​ అరెస్టు చేసిన  కేరళ విజింజం ఆయుధాల రికవరీ కేసులో కూడా NIA దర్యాప్తు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement