Thursday, April 25, 2024

బ‌స్సు చార్జీలు త‌గ్గించిన ఆర్టీసీ.. ఎవ‌రికి వ‌ర్తిస్తాయంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) హైద‌రాబాద్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు టిక్కెట్ చార్జీలపై 20 శాతం త‌గ్గింపు ప్ర‌క‌టించింది. దీంతో హైదరాబాద్‌కు రానున్న‌ ప్రయాణికులకు చార్జీ త‌గ్గే అవకాశం ఉంది. విజయవాడ నుండి హైదరాబాద్‌కు వచ్చే గరుడ, నైట్ రైడర్, ఇంద్ర, అమరావతి, వెన్నెల స్లీపర్ సర్వీసులతో సహా వివిధ ఎయిర్ కండిషన్డ్ బస్సులకు ఈ త‌గ్గింపు చార్జీలు వర్తించ‌నున్నాయి. విజయవాడ, మచిలీపట్నం, ఆటో నగర్‌, గుడివాడ బస్‌ డిపోల నుంచి ఫిబ్రవరి 28 వరకు హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు ఈ రాయితీకి అర్హులని ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఎం. యేసు దానం పేర్కొన్నారు.

ముఖ్యంగా, ప్రయాణికులు హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడు ఆదివారం మినహా అన్ని రోజులలో తగ్గింపు ధరలను పొందవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నుండి వచ్చేటపుడు శుక్రవారం మినహా అన్ని రోజులలో తగ్గింపు చార్జీలు వర్తిస్తాయని ఆర్ ఎం యేదుదానం తెలిపారు.

బస్సు ఛార్జీల వివ‌రాలు..
గరుడ సర్వీస్ మచిలీపట్నం- బీహెచ్‌ఈఎల్ బస్సు చార్జీలు సాధారణ రోజుల్లో రూ.785. దీనికి తగ్గింపు ధర రూ.685.

అదేవిధంగా.. మచిలీపట్నం-బిహెచ్‌ఇఎల్ నైట్ రైడర్‌కు తగ్గింపు బస్సు చార్జీలు రూ.640, నైట్ రైడర్ బెర్త్‌కు రూ.800.

తగ్గింపు తర్వాత గుడివాడ-బీహెచ్‌ఈఎల్ (ఇంద్ర), విజయవాడ-హైదరాబాద్ (అమరావతి) బస్సు చార్జీలు వరుసగా రూ.555 మరియు రూ.535గా ఉండ‌నున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement