Tuesday, May 7, 2024

ఆచార్య‌లో 45నిమిషాలు ఉండ‌నుంద‌ట – రామ్ చ‌ర‌ణ్ పాత్ర

ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ పాత్ర 45నిమిషాలు ఉంటుంద‌ట‌. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 29వ తేదీన థియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చరణ్ ఎంతసేపు కనిపించనున్నాడనేది మొదటి నుంచి అందరిలో ఆసక్తిని రేపుతున్న విషయం. ఇక ఇంటర్వెల్ కి ముందు ఆయన కనిపిస్తాడా? ఆ తరువాత ఎంట్రీ ఇస్తాడా? అనేది మరో ప్రశ్నగా చర్చల్లో ప్రధానమైన అంశమై కూర్చుంది.ముందుగా ఈ సినిమాలో ‘సిద్ధ’ అనే పాత్రను గెస్టుగా చూపించాలని అనుకున్నారు. తెరపై ఈ పాత్రను ఓ 15 నిమిషాల పాటు చూపించాలనుకున్నారు. కానీ ఆ పాత్రలో మంచి స్టఫ్ ఉండటంతో పెంచుతూ వెళ్లారట. అలా 15 నిమిషాలు మాత్రమే అనుకున్న ఈ పాత్ర నిడివి 45 నిమిషాలకు పెరిగినట్టుగా చెబుతున్నారు. చరణ్ పాత్ర ఇంటర్వెల్ కి ముందు .. ఆ తరువాత కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement