Sunday, May 5, 2024

ఆటా… నాటా.. తానా…రాజ‌కీయ తందాన ..

భారత సంతతి అమెరికాకు చేరి అక్కడ కూడా కులాల కుంపట్లు రాజేశారు. అలాగే రాష్ట్రాల వారీగా వేర్వేరు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. దీర్ఘకాలంగా తమ పనులకే పరిమితమైన విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు గత మూడు దశాబ్దాలుగా భారత్‌లో పెట్టుబడుల వైపు కూడా ఆసక్తి పెంచుకున్నారు. కాగా గతకొన్నాళ్ళుగా భారతీయ రాజకీయాల్ని శాసించే దిశగా వీరిలో ఆశలు ఏర్పడ్డాయి. ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పటికీ భారత్‌లో మాత్రం తమ కులం, లేదా తమ రాష్ట్రానికి చెందిన పార్టీ అధికారంలోకి రావాలన్న ఉత్సుకత వీరిలో పెరిగింది. ఇందుకోసం తామక్కడ సంపాదించి పోగేసిన సొమ్ములో కొంత భాగాన్ని వ్యయం చేసేందుకు కూడా వీరు సిద్ధపడుతున్నారు. ఈ పరిస్థితుల్ని భారతీయ రాజకీయవేత్తలు, పాలకులు కూడా తమకనుకూలంగా మలచుకుంటున్నారు.

(న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)

ఈసారి జరగనున్న ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత వ్యయమైనవి కానున్నాయి. దాదాపు అన్ని పార్టీలకు రానున్న ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. ఇప్పటికే ఎన్నికల్ని ఓట్ల కొనుగోలు నుంచి కార్యకర్తల నిర్వహణ కోసం చేస్తున్న ఖర్చు అనూహ్యంగా పెరిగింది. నిబంధనల్ని ఎంత కఠినం గా అమలుచేస్తున్నా ఎన్నికల్లో నిధుల ప్రవాహం ఏ పార్టీకి తప్పడంలేదు. సిద్ధాంతాలు, లక్ష్యాలతోపాటు పార్టీలిచ్చే మొత్తం కూడా సంతృప్తికరంగానే ఉంటే ఓటర్లు పోలింగ్‌ బూత్‌లవైపు అడుగులేస్తున్నారు. ఒకప్పుడు నిఖార్సైన అభ్యర్థి కోసం ఎదురుచూసిన ఓటర్లు ఇప్పుడు ఎక్కువ మొత్తం చెల్లించే వారివైపు మొగ్గుచూపుతున్నారు. పార్టీలు కూడా ఈ పరిస్థితికి అలవాటుపడ్డాయి. వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ఎన్నికల్లో వ్యయం చేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఇప్పటి వరకు దేశీయంగానే ఎన్నికల విరాళాల్ని రాజకీయ పార్టీలు పోగేస్తున్నాయి. విదేశాల నుంచి కూడా విరాళాలు వస్తున్నా అవి కొద్ది మోతాదులోనే ఉండేవి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చు కోసం ఎక్కువగా విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ కుటుంబాలపై దృష్టిపెట్టాయి. వార్ని తమకనుకూలం గా ఆకర్షిస్తున్నాయి. ఇందుకోసం పార్టీల అధినేతలు గత కొంతకాలంగా వివిధ కార్యక్రమాల పేరిట విదేశీ పర్యటనలకు పరుగులు దీస్తున్నారు.

శతాబ్దం క్రితమే భారత్‌ నుంచి వైద్యనిపుణులు విదేశాలకెళ్ళి స్థిరపడ్డం మొదలైంది. రాన్రాను వివిధ రంగాల్లోని నిపుణులు పలు దేశాల్లో ఉన్నత భవిష్యత్‌ వెదుక్కుంటూ వెళ్ళిపోయారు. గత మూడు దశాబ్దా లుగా వీరి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడు దాదాపు 152 దేశాల్లో భారతీయ సంతతి ఉన్నారు. ఒక్క అమెరికా లోనే కోటిమందికి పైగా భారతీయ సంతతి స్థిరపడ్డారు. అలాగే యూరోప్‌ దేశాల్లో కూడా వీరు పెద్ద సంఖ్యలో ఉన్నారు. విదేశాల్లో మత విచక్ష ణ తప్ప కులవిచక్షణ ఉండేది కాదు. అమెరికా వంటి దేశా ల్లో తెలుపు, నలుపు జాతుల మధ్య అంతరాలుండేవి.

ఇటీవల ప్రధాని మోడి విదేశీయా త్రలు పెరిగాయి. తరచూ అమెరి కా, యూరోప్‌లకు వెళ్తు న్నారు. వెళ్ళిన ప్రతి సంద ర్భంలో అక్కడున్న భారతీయ సంతతితో ప్రత్యేకంగా సమావేశమౌతున్నారు. మరో వైపు ఆయా దేశాల్లో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబీకులతో కూడా మరో సమావేశం నిర్వహిస్తున్నారు. గుజరాతీయులే భారత్‌ ను ఏలాలన్న దృక్పథాన్ని వారిలో మరింత బలంగా నాటుతున్నారు. అందుకనుగుణం గా అధికార పార్టీకి ఎన్‌ఆర్‌ఐల నుంచి పెద్దమొత్తంలో విరాళాల్ని రాబడు తున్నారు. ప్రధాని మోడి చేసే పర్యటనల్లో భారత్‌కు పెట్టుబడుల ఆకర్షణ కోసం నిర్వహిస్తున్న వాటితో పోలిస్తే ఎన్నికల వ్యయం కోసం విరాళాల పోగువేత మరింత వేగంగా సాగుతోంది. అలాగే కాంగ్రెస్‌ ప్రతినిధి రాహుల్‌ గాంధీ న్యాయ స్థానం నుంచి ప్రత్యేక అనుమతులు పొంది మరీ విదేశీ పర్యటనలకు పరుగులు పెడుతున్నారు. ఆయన కూడా ఎన్‌ఆర్‌ఐల తో సమావేశాలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌కు వారి నుంచి మద్దతు కూడగడుతున్నారు. అలాగే పార్టీకి విరాళాల సేకరణ చేపడుతున్నారు. రాహుల్‌ ఓ వైపు అక్కడ స్థిరపడ్డ భారతీయులతో మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌ కు చెందిన వారితో విడివిడిగా సమావేశాలు జరుపుతు న్నారు. దేశానికి కాంగ్రెస్‌ అవసరాన్ని నొక్కి చెబుతు న్నారు. తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు అనువైన పరిస్థితుల కల్పనకు నిధుల సమీకరణ నిర్వహిస్తున్నా రు.

వీరిద్దరే కాదు.. ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా ఈ విషయంలో పోటీలు పడుతున్నారు. జాతీయ పార్టీల నాయకులు విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులతోనూ, ఆయా పార్టీల అధినేత లకు చెందిన రాష్ట్రాల వారితో సమావేశాలు నిర్వహిస్తుంటే దేశంలోని ప్రాంతీయ పార్టీలు విదేశాల్లో స్థిరపడ్డ తమ సామాజిక వర్గీయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తు న్నాయి. ఇటీవల అమెరికాలో స్థిరపడ్డ తెలుగు సంతతి వారంతా ఆటా, నాటా, తానా ఇలా రకరకాల పేర్లతో ఏర్పాటు చేసుకున్న సంఘాల వార్షిక సమావేశాల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొనేందుకు పరుగులు తీశారు. ఈ సంఘాలన్నీ అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారివే అయినప్పటికీ ఒక్కోటి ఒక్కో సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోంది.

- Advertisement -

అక్కడి వారిలో కొందరు రెడ్లు మాత్రమే పాలకులుగా ఉండాలని, మరికొందరు చౌదరిలకు మాత్రమే పాలించే సామర్థ్యం ఉందని, ఇంకొందరు కాపులకు ఈసారి పట్టం కట్టాల్సిందేనన్న ఆకాంక్షతో రగిలిపోతున్నారు. ఇందుకోసం అవసరమైన నిధుల్ని సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ కారణంగానే అన్ని పార్టీల నాయకులు ఈసారి అమెరికా సంబురాలకు పోటెత్తారు. అక్కడ స్థిరపడ్డ రెడ్లంతా ఏపీలో వైకాపాకు, తెలంగాణాలో కాంగ్రెస్‌కు ఆర్థిక వెన్నుదన్ను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే చౌదరిలు తెలుగుదేశానికి వెన్నెముఖగా మారారు. కాపులంతా జనసేనకు తోడ్పాటు నందించే ప్రయత్నాలు మొదలెట్టారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు కూడా విదేశాల్లో స్థిరపడ్డ తమ రాష్ట్రం లేదా సామాజికవర్గానికి చెందిన సంపన్న కుటుంబాల నుంచి విరాళాల సేకరణకు గట్టిప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పటికే తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన కుమారుడు ఉదయ్‌నిధికి ఈ బాధ్యతలు అప్పగించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇటీవలె విదేశీ పర్యటనలు పూర్తి చేసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement