Saturday, May 4, 2024

Sabita Indra Reddy – ‘స‌బిత‌మ్మ విజ‌యూభ‌వ’ – ఏ నియోజ‌క‌వ‌ర్గ‌మైన గెలుపు ఆమెదే ..

ఉదయం నుండి రాత్రి పొద్దుపోయేంత వరకు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు… పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు… ప్రారంభోత్సవాలు… శంకుస్థాపనలతో దడ పుట్టిస్తున్నారు…. ఆమె విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి… మహేశ్వరం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితారెడ్డి ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అనే విధంగా పర్యటనలు చేస్తున్నారు… నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంతోపాటు గ్రామీణ ప్రాంతం ఉండటంతో అటు ఇటు తిరుగుతూ ఓటర్లలో నోట్లో నాలుకగా మారిపోయారు… మూడవసారి నియోజక వర్గం విజయం సాధించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.. ప్రజల మనిషిగా ముద్రపడ్డా ఆమెకు ఇంటిపోరు తప్పడం లేదు… భారాసలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టికెట్టు ఆశిస్తున్నారు… మూడుసార్లు ఎన్నికలు జరగగా ఇందులో రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా సబితారెడ్డి విజయం సాధించారు… ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలో అరడజను మంది చొప్పున పోటీలో ఉన్నారు.

ఉమ్మడి రంగారెడ్డి, ప్రభన్యూస్‌ బ్యూరో:

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సుడిగాలి పర్యటనలు చేయడంలో తనకు తానే సాటి. ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలోనే తొలి హోం మంత్రి గా నాలుగేళ్లపాటు పని చేశారు.. అప్పుడూ ఇప్పుడూ తాను ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గం ప్రజలకు అందుబాటు లో ఉండటంతో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా అభివృద్ధి చేయడం ఆమెలోని ప్రత్యేకత. ఇటీవల సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించారు. సబితారెడ్డి అడిగిందే తడువుగా ఏకంగా రూ. 160 కోట్లు మంజూరు చేశారు. మెడికల్‌ కాలేజీ కూడా మంజూ రు చేశారు… సబితారెడ్డిని ఇంటి ఆడబిడ్డగా అభివర్ణించారు.

2000సంవత్సరంలో అనుకోని విధంగా సబితారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో జరిగిన రోడ్డు ప్రమాదం లో మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధిం చారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా చేవెళ్ల నుండే పోటీ చేసి గెలిచారు. అప్పట్లో వైఎస్‌ మంత్రి మర్గంలో గనులు, భూ గర్భవనరుల శాఖ మంత్రిగా పని చేశారు. 2009 నియోజకవ ర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్ల ఎస్సీ రిజర్వు కావడంతో కొత్తగా ఏర్పాటైన మహేశ్వరం నుండి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో దేశంలోనే తొలి హోం మంత్రిగా బాధ్య తలు చేపట్టారు… నాలుగేళ్లపాటు మంత్రిగా కొనసాగారు… 2014లో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయంతో తాను పోటీ చేయలేకపోయారు. ఇంట్లో ఒకరికి మాత్రమే పోటీ చేసే అవకాశం దక్కడంతో తన కుమారుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీ గా పోటీ చేయడంతో తాను పోటీ చేసే అవకాశం దక్కలేదు.. తాజాగా 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి 10వేల మెజార్టీతో భారాస అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పై విజయం సాధించారు. ఏడాది తరువాత కాంగ్రెస్‌కు చెంది న 12మంది శాసనసభ్యులు భారాసలో చేరడం సబితారెడ్డికి మంత్రి పదవి వరించడం చకచక జరిగిపోయింది.

మూడుసార్లలో రెండుసార్లు కాంగ్రెస్‌ విజయం..
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజక వర్గం ఏర్పాటైంది. మూడుసార్లు అసెంబ్లిd ఎన్నికలు జరగగా ఇందులో రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 2009లో తొలిసారి సబితా రెడ్డి పోటీ చేశారు. అప్పట్లో తెదేపా అభ్యర్థిగా తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా సబితారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. అప్పట్లో లోకల్‌… నాన్‌ లోకల్‌ అనే ప్రచారం జరిగినా విజయం సబితారెడ్డినే వరించింది. 2014 లో పోటీ చేయలేదు. అప్పట్లో మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తిరిగి సబిత కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగారు. భారాస గాలిలో కూడా పదివేల మెజార్టీతో తీగల కృష్ణారెడ్డి పై విజయం సాధించారు. మూడుసార్లు ఎన్నికలు జరగ్గా ఇందులో రెండుసార్లు సబితా రెడ్డి విజయం సాధించడం చకచక జరిగిపోయింది.

తప్పని ఇంటిపోరు..
సబితారెడ్డికి ఇంటిపోరు తప్పడం లేదు.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈసారి టికెట్టు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వయస్సు రీత్యా తనకు చివరి ఎన్నికలని తనకే అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పని చేసిన నాయకులు కొందరు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలో దిగి దాదాపుగా 50వేల ఓట్లు సాధించిన కొత్త మనోహర్‌రెడ్డి, ఉద్య మ సమయంలో పోరాటాలు చేసిన కప్పాటి పాండురంగారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఉద్యమకారులను తమవైపు తిప్పుకునేం దుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -

ప్రతిపక్ష పార్టీల్లో పోటీ ఎక్కువే..
మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలో పోటీ తీవ్రంగా ఉంది. చాలామంది టికెట్టు రేసులో ఉన్నారు. ఎవరికి వారే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి, బడంగ్‌పేట మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పారిజాతరెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన కొత్త మనోహర్‌రెడ్డి, జడ్పీ మాజీ ప్లోర్‌ లీడర్‌ ఏనుగు జంగారెడ్డి, యువనేత దేప భాస్కర్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు రేసులో ఉన్నారు. బీజేపీలో 2018లో పోటీ చేసి ఓటమిపాలైన శ్రీరాములుయాదవ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్‌గౌడ్‌తోపాటు మరికొందరు నేతలు పోటీపడుతున్నారు. ఎవరికి వారే టికెట్టు వస్తుందనే ధీమాతో ఉన్నారు. మూడుసార్లు ఎన్నికలు జరగ్గా అందులో రెండు సార్లు తమ కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించినందునా ఈసారి తామే గెలుస్తామనే ధీమాతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గాలి వీస్తున్నందునా మహేశ్వరంలో ఖాతా తెరుస్తామని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement