Monday, May 6, 2024

ముంబై, ఢిల్లీ పోలీసుల జాయింట్​ ఆపరేషన్.. మర్డర్​ ఇన్వెస్టిగేషన్​కు సహకరించని ఆఫ్తాబ్

27 ఏళ్ల యువతిని ఆమె లివ్-ఇన్ భాగస్వామి హత్య చేసిన దారుణ ఘటనలో మరిన్ని అంశాలు బయటకొస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా ప్రాథమిక విచారణ సమయంలో పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని, తన వాంగ్మూలం ప్రతి సారి చేంజ్​ చేసి చెబుతున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. మాణిక్‌పూర్ పోలీసు సీనియర్ ఇన్‌స్పెక్టర్ సంపత్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆప్తాబ్ పూనావాలాను పోలీసులు వాంగ్మూలం కోసం స్టేషన్​కి పిలిచారు. తొలుత అతను ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో తన స్నేహితురాలు శ్రద్ధా వాకర్‌తో కలిసి ఉంటున్నట్లు అంగీకరించాడు.

“ఈ ఏడాది మేనెలలో మా మధ్య వాగ్వాదం జరిగింది. శ్రద్ధ విడిచిపెట్టింది. అప్పటి నుండి ఆమె ఎక్కడ ఉందో నాకు తెలియదు” అని విచారణలో ఆఫ్తాబ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక మరోసారి మరో విధంగా చెప్పాడని, తన స్టేట్‌మెంట్‌లను మారుస్తూనే ఉన్నాడని ఇన్​స్పెక్టర్​ తెలిపారు.

తాము ఇన్‌పుట్‌ను సీనియర్ అధికారులతో షేర్​ చేసుకున్నాం. అదే విషయాన్ని ఢిల్లీ పోలీసులు, మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌ వారితో కూడా షేర్​ చేశామని వివరించారు. తమ అధికారులు కూడా ఆ ఇంటికి వెళ్లి హత్యకు గురైన యువతి మొబైల్ డేటా, బ్యాంక్ రికార్డులను పరిశీలించామన్నారు. అయితే.. 2022 మే నుంచి బ్యాంకు లావాదేవీలు ఏవీ జరగలేదని, లే ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఇన్​స్పెక్టర్​ పాటిల్ చెప్పారు.

నిందుతుడి వాంగ్మూలాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, అతను వాటిని పదే పదే మారుస్తూనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ముంబై పోలీసుల ఇన్‌పుట్‌ల ప్రకారం ఢిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం  చేశారు. ఇది జాయింట్ ఆపరేషన్ గా సాగుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా, అఫ్తాబ్ అసభ్యంగా ప్రవర్తించాడని, శ్రద్ధపై దాడి చేశాడని శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ పేర్కొన్నట్లు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

కాగా, 27 ఏళ్ల శ్రద్ధను ఆమె లైవ్-ఇన్ భాగస్వామి గొంతు కోసి చంపి, ఆమె శరీరాన్ని దాదాపు 35 ముక్కలుగా చేసి, దాదాపు 20 రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో క్రమంగా వాటిని పారేశాడు.  ఈ ఘటనకు పాల్పడ్డ 28 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. యువతికి సంబంధించిన కత్తిరించిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement