Wednesday, May 15, 2024

Omicron: భారత్ లో ఒమిక్రాన్ కల్లోలం.. దేశంలో 415కు పెరిగిన కేసులు

భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్రం అధికారికంగా వెల్లడించింది. గత రెండు, మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు ఇంతలు పెరిగాయి. దేశంలోని 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల్లో 115 మంది కోలుకున్నారు.

మహారాష్ట్రలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదైయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం మహారాష్ట్రంలో 108 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్ లో 22, హర్యానా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 4 చొప్పున కేసులు నమోదు కాగా.. జమ్మూకశ్మీర్ , వెస్ట్ బెంగాల్ లో 3 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఇక, చత్తీస్ గఢ్, లఢాఖ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో బాధితుల సంఖ్య 415కి చేరింది.  

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరగడంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షల చట్రంలోకి వెళ్లాయి. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల నైట్ కర్ప్యూ విధించాయి. ఓడిశా, కర్ణాటక, ఢిల్లీ  రాష్ట్రాలు న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలను నిషేధించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement