Monday, May 6, 2024

Sukh Villas: ఓ విలాసవంతమైన రిసార్ట్​ కథ.. దీనికోసం రూల్స్​ అన్నీ మోకాళ్లమీద సాగిలపడ్డయ్​!​

మాజీ ఉప ముఖ్యమంత్రి, అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు చెందిన సుఖ్ విలాస్ అనే విలాసవంతమైన రిసార్ట్​పై ఆరోపణలు వస్తున్నాయి.  పంజాబ్ ల్యాండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ (పిఎల్‌పిఎ)లోని సెక్షన్ 4ను ఉల్లంఘించి ఈ విల్లా నిర్మించినట్లు తెలుస్తోంది. PLPAలోని సెక్షన్ 4 ప్రకారం కొండకింది ప్రాంతంలో (శివాలిక్ కొండల ఉప పర్వత పాదాలు) ఎటువంటి శాశ్వత నిర్మాణ కార్యకలాపాలు చేపట్టకూడదు. కానీ, క్యాంపింగ్ సైట్లు మొదలైన వాటి కోసం తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే ఇక్కడ చేయడానికి చాన్సెస్​ ఉన్నాయి.

‌- డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

సుఖ్ విలాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణంలో ఏదైనా ఉల్లంఘన జరిగిందా అనే దానిపై విచారణ జరుపుతామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. 2016లో అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు దాని నిర్మాణానికి కేబినెట్ నుండి అనుమతి కోరిన తర్వాత.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పంజాబ్ ల్యాండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ (పిఎల్‌పిఎ)ని ఉల్లంఘించారని సీఎం మాన్ తెలిపారు. సుఖ్ విలాస్ నిర్మాణానికి కేబినెట్​ నుంచి అన్ని పర్మిషన్లు దక్కాయి. కానీ, అలాంటి ఇతర ప్రాజెక్ట్ లలో మాత్రం పర్మిషన్​ హోల్డ్ లో ఉంచారని తెలిపారు.  

సుఖ్ విలాస్ నిర్మాణం వెనుక అసలు కథ..

- Advertisement -

సుఖ్ విలాస్ ప్రాజెక్టు వచ్చినప్పుడు పంజాబ్ కేబినెట్ ముందు రాబోయే రెండు ప్రాజెక్టుల ఫైళ్లు వచ్చాయి. అందులో ఒకటి గర్ శంకర్ వద్ద – ఆ ప్రాజెక్ట్ పేరు గజ్ ప్రాజెక్ట్. మరొకటి సిస్వాన్‌లోని పల్లన్‌పూర్ గ్రామంలోని సుఖ్ విలాస్ లగ్జరీ రిసార్ట్. అటవీ సంరక్షణ చట్టం (FCA), 1980 ప్రకారం అటవీ భూముల మళ్లింపు కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MoEF) సుఖ్ విలాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. ఇది FCA నిబంధనలకు విరుద్ధంగా క్లియరెన్స్​ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే.. FCA కింద ఆమోదం అంటే పంజాబ్ ల్యాండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ PLPA కింద ఆటోమేటిక్ క్లియరెన్స్ అని అర్థం కాదు. ఫిబ్రవరి 2003లో నోటిఫై చేసిన PLPA చట్టం.. ఫిబ్రవరి 2018లో గడువు ముగిసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం భూమిని క్లియర్ చేయడం, విచ్ఛిన్నం చేయడం లేదా సాగు చేయడంపై పూర్తి నిషేధం ఉంది. ఇక.. క్వారీయింగ్, ఇసుక, చెట్లు, మట్టిని తొలగించడం మొదలైనవి ఇక్కడ అస్సలు చేపట్టవద్దు.  

పంజాబ్ ఎకో-టూరిజం పాలసీ 2009 కింద సుఖ్​ విలాస్​ నిర్మాణం..

పంజాబ్ ఎకో-టూరిజం పాలసీ (2009), గ్రామీణుల జీవనం మరియు జీవనోపాధికి భద్రత కల్పించడానికి.. వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడటానికి పర్యావరణ పర్యాటక ప్రాజెక్టును ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, మెట్రో ఎకో గ్రీన్ రిసార్ట్ ను వాణిజ్య ప్రాతిపదికన ఒబెరాయ్‌ల సహకారంతో నిర్మించారని, చట్టవిరుద్ధంగా దీనికి చట్టబద్ధత కల్పించారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఆప్ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.  

2018,  ఫిబ్రవరి 3న తీసుకొచ్చిన పిఎల్‌పిఎ తాజా నోటిఫికేషన్‌ను అనుసరించాల్సి ఉన్నప్పటికీ ఈ నిర్మాణంపై పరిమితులు అలాగే ఉన్నాయి. అంటే మెట్రో ఎకో-గ్రీన్ రిసార్ట్స్ నిర్వహించే సుఖ్ విలాస్ స్వాధీనం చేసుకున్న 75శాతం ప్రాంతంలో జీవావరణ శాస్త్రాన్ని తారుమారు చేయడం సాధ్యం కాదు. దురదృష్టవశాత్తూ, సుఖ్ విలాస్ చుట్టుపక్కల ప్రాంతం PLPA కింద అనుమతించబడని పెడిక్యూర్ మరియు మెనిక్యూర్ చేయబడింది. అలాగే పల్లన్‌పూర్‌ గ్రామానికి వెళ్లే రోడ్డు, సుఖ్‌ విలాస్‌ ప్రైవేట్‌ అవసరాల కోసం నిర్మించారు.  

ఎఫ్‌సిఎ, 1980 కింద సుఖ్ విలాస్‌కు ఇచ్చిన అనుమతుల ప్రకారం రిసార్ట్ ను అభివృద్ధి చేయడానికి ప్రమోటర్లకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, వారు 225 చెట్లను నేలమట్టం చేసినట్టు తెలుస్తోంది. ఇది PLPA మరియు FCA రెండింటినీ పూర్తిగా ఉల్లంఘించి చేపట్టినట్టు అవగతం అవుతోంది.

బురానా, సియోంక్, గోచెర్, పల్లన్‌పూర్, తారాపూర్, మజ్రా, దుల్వాన్, సిస్వాన్, ఛోటీ బారి నాగల్, సుల్తాన్‌పూర్, పరోల్, పర్చ్, నాడా, మజ్రియన్ మరియు కరోరాన్ ఈ గ్రామాలు PLPA పరిధిలోకి వస్తాయి. సుఖ్ విలాస్ లగ్జరీ రిసార్ట్ పల్లన్‌పూర్ గ్రామ పరిధిలోకి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement