Thursday, April 25, 2024

ఆహాలో మ‌రోసారి బాల‌య్య హంగామా- త్వ‌ర‌లో అన్ స్టాప‌బుల్ సీజ‌న్2

హోస్ట్ అంటే గ‌ల గ‌లా మాట్లాడాలి..అంద‌రితో క‌లిసి మెల‌సి ఉండాలి..మ‌రి ఎవ‌రిని అంటీ అంట‌న‌ట్టు ఉండే హీరో బాల‌కృష్ణ హోస్ట్ అంటే ఎవ‌రికైనా డౌట్ వ‌స్తుంది..ఆ షో స‌క్సెస్ అవుతుందా అని. అలాంటివారంద‌రి అనుమానాల‌ని ప‌టా పంచ్ లు చేశారు బాల‌య్య‌. ఆహా లో అన్ స్టాప‌బుల్ షో అన్ బిలీవబుల్ సక్సెస్ అయింది. హోస్ట్ గా బాలకృష్ణ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఈ షోలో ప్రశ్నలు కూడా సక్సెస్ కి ఒక కారణం. ఎటువంటి ఫిల్టర్లు లేకుండా లోతులు వెళ్లి వ్యక్తిగత విషయాలు కూడా తెరపైకి తెచ్చారు. మోహన్ బాబు, మహేష్, రవితేజ వంటి స్టార్స్ తో బాలయ్య ఎపిసోడ్స్ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉన్నాయి.

బాలయ్యలో తెలియని కోణాలు ఈ షో ద్వారా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 త్వరలో అంటూ మేకర్స్ ప్రకటించేశారు. వి ఆర్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్, ఆడియన్స్ పండగ చేస్తుకుంటున్నారు. అన్ స్టాపబుల్ 2 షూటింగ్ కి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయ‌ట‌. మొద‌టిసారే హోస్ట్ గా స‌క్సెస్ అయిన బాల‌య్య అన్ స్టాప‌బుల్ సీజ‌న్2 తో అభిమానుల‌కి మ‌రింత చేరువ‌వుతార‌నే టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement