Thursday, May 2, 2024

ఆస్ట్రల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

బిల్డింగ్ మెటీరియల్స్‌ను అందించే అగ్రగామి కంపెనీలలో ఒకటైన ఆస్ట్రల్ లిమిటెడ్ అల్లు అర్జున్‌తో జత కట్టి, తమ పైపులు, వాటర్ ట్యాంక్ వ్యాపారాల కోసం ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ బంధం ఆస్ట్రల్ పైప్స్ ఎకోసిస్టమ్ అంతటికీ మరింత విలువను, ప్రాముఖ్యాన్ని జోడించి, మార్కెట్‌లో ఆస్ట్రల్ వ్యాపారాల వృద్ధికి మరింత దోహదం చేస్తుంది.

ఈ భాగస్వామ్యం గురించి ఆస్ట్రల్‌కు చెందిన ఇంజనీర్ కైరవ్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం తాము ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నామని సూచిస్తోందన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్ ఈ ప్రాంతీయ అనుసంధానానికి జత కడితే ఈ మార్కెట్‌లలో తాము బలంగా నిలద్రొక్కుకునేందుకు, మైండ్ షేర్‌ను, మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు తమకు బాగా సహాయపడతారన్నారు. ఈ సెంటిమెంట్‌నే ప్రతిధ్వనిస్తూ అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఇంటింటా మార్మోగుతున్న, నాణ్యతకు, నూతన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన, ఎంతో ముందు చూపు కలిగిన బ్రాండ్ అయిన ఆస్ట్రల్ పైప్స్ తో జత కడుతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. బ్రాండ్ వైవిధ్యభరితమైన శ్రేణిని తాను ప్రపంచానికి చాటి చెప్పగలనన్నారు. ఈ బంధంతో ఒక్కటై ప్రయాణించాలని ఎదురుచూస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement